దివంగత నటీమణి సౌందర్య అకాల మరణం పొంది చిత్ర పరిశ్రమకు తీరని లోటు మిగిల్చారు.అయితే ఆమె చనిపోయే ముందు జరిగిన సంఘటన గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
అప్పట్లో దర్శకుడు చిట్టిబాబు కృష్ణ తో కలిసి రైతు భారతం అనే సినిమాని రూపొందించాలనుకున్నారు.ఆ సినిమాలో మొదటి హీరోయిన్ గా వాణి విశ్వనాథన్ ని తీసుకున్నారు.
అలాగే సుందరమైన రూపంతో పాటు అద్భుతమైన నటనా చాతుర్యము, అభినయము కలిగిన నటి ని ‘రైతు భారతం’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవాలని చిట్టిబాబు అనుకున్నారు.అందుకోసం ఎంతోమంది హీరోయిన్లను చూసారు కానీ ఆయనకు ఎవరూ నచ్చలేదు.
అయితే అప్పట్లో ఎడిటర్ గా పనిచేస్తున్న రామయ్య. డైరెక్టర్ చిట్టిబాబు కి ఫోన్ చేసి మీరు వెతుకుతున్న లక్షణాలు కలిగిన నటీమణి బెంగళూరులో ఉన్నారు.వీలు చూసుకుని ఒకసారి బెంగళూరు వచ్చి ఆమెను చూడండి అని చెప్పారు.అయితే మేకప్ లేకుండా ఆమె ఎలా ఉంటుందో చూడాలనుకున్న చిట్టిబాబు ఎవరికి ఏమీ చెప్పకుండా నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు.
అయితే అక్కడ ఆమెను మేకప్ లేకుండా చూసి చిట్టిబాబు మంత్రముగ్దులయ్యారు.వెంటనే పేమెంట్ ఇచ్చేసి తన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు.
ఆమె మరెవరో కాదు అందాల రాసి సౌందర్య.అయితే ఈ టైమ్ లోనే చిట్టిబాబు సౌందర్య తండ్రి అయిన కే.ఎస్ సత్యనారాయణ ను కూడా కలిశారు.సౌందర్య తండ్రి జాతకాలు చెప్పేవారు.
చిట్టిబాబు వచ్చినప్పుడు.కే.ఎస్ సత్యనారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ “నా కూతురికి సినిమా అవకాశాలు ఇలా వస్తున్నాయేంటి?” అని ఆమె జాతకం చూసి.సౌందర్య 10-12 సంవత్సరాలు మాత్రమే సినిమాల్లో రాణించగలదు అని చెప్పారు.
అయితే అప్పట్లో ఆయన చెప్పిన జాతకం విని 10-12 ఏళ్ల తరువాత సౌందర్య సినీ కెరీర్ పతనం అవుతుందేమోనని చిట్టిబాబు అనుకున్నారు.కానీ ఆమె చనిపోతుందని ఊహించలేకపోయారు.
ఇక జాతకం విన్న తరువాత సౌందర్య ని తీసుకొని చెన్నై తీసుకెళ్లి విజయగార్డెన్స్ లో షూటింగ్ ప్రారంభించారు.అయితే షూటింగ్ స్టార్ట్ చేసే ముందు తన డైరెక్షన్ లో తీసే మూడు సినిమాల్లో నటించాలని సౌందర్య చేత చిట్టిబాబు అగ్రిమెంట్ రాయించుకున్నారు.కానీ కే.ఎస్ రవి కుమార్, ఎస్.వి కృష్ణారెడ్డి, పి.ఎస్ రాంచంద్ర రావు వంటి ప్రముఖులు నుంచి సౌందర్య కి ఆఫర్స్ వచ్చినప్పుడు చిట్టిబాబు అడ్డుచెప్పలేదు.ప్రతి ఆఫర్ ని వినియోగించుకోవాలని ఆమెను బాగా ప్రోత్సహించారు.అయితే సౌందర్య నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్స్ కావడంతో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయ్యారు.సౌందర్య మరణించే ముందు డైరెక్టర్ చిట్టిబాబు గెలుపు అనే సినిమాని తీశారు.ఈ మూవీలో సౌందర్య ఓ అతిధి పాత్రను పోషించారు.
అయితే స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి.ఓ గెస్ట్ రోల్ లో నటించడమేంటి.
అని అప్పట్లో మీడియా జర్నలిస్టులు సౌందర్య ని ప్రశ్నించారు.వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ.
చిట్టిబాబు గారు నన్ను బెంగళూరు నుంచి హైదరాబాద్ కి తీసుకొచ్చి సినిమాలు చేయించారు.ఆయన వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నారు.
ఆయన చేసిన సాయానికి నేను గెలుపు మూవీలో ఓ పాత్రలో నటించి ఋణం తీర్చుకున్నాను అని సౌందర్య చెప్పుకొచ్చారు.
అయితే సౌందర్య మరణానంతరం చిట్టిబాబు ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ప్రతి ఇంటర్వ్యూ లో ఆయన సౌందర్య గురించి తలుచుకొని కంటతడి పెట్టుకునేవారు.సౌందర్య తన కుటుంబ సభ్యురాలిగా ఆయన భావించేవారు.
ఆమె బీజేపీ తరుపున ప్రచారం చేయాలని చిట్టిబాబే ఒప్పించారట.ఆమె మరణానికి ముందు ఏం జరిగిందో ఓ ఇంటర్వ్యూ లో చిట్టిబాబు చెప్పారు.
ఆయన చెప్పిన ప్రకారం.సౌందర్య చనిపోయే ముందు ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్ కి స్పెషల్ హెలికాఫ్టర్ లో నల్గొండ వెళ్లి ప్రచారం చేయాల్సి ఉంది.
ఆ ప్రచారం అనంతరం ఆమె హైదరాబాద్ వెళ్లి అక్కడ నుండి చెన్నై లో షూటింగ్ లో పాల్గొనాలి.అయితే ఆ టైమ్ లోనే ఆమె కోసం బుక్ చేసిన హెలికాప్టర్ ఉత్తరప్రదేశ్ లీడర్ ములాయం సింగ్ యాదవ్ దగ్గర ఉండిపోయింది.
ఆయన దాన్ని మరికొన్ని రోజులు ఉపయోగించుకోడానికి పర్మిషన్ లు పెంచుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న చిట్టిబాబు సౌందర్య కి ఫోన్ చేసి జెట్ ఎయిర్వేస్ లో హైదరాబాద్ కి రావాలని కోరారు.హైదరాబాద్ నుంచి తన కారులో నల్గొండ ప్రచారానికి వెళ్లొచ్చని చిట్టిబాబు చెప్పారు.దీనికి సౌందర్య సరే అన్నారు కానీ ఆమె సోదరుడు అమర్నాథ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన ఫ్రెండ్ కి ఓ హెలికాప్టర్ ఉందని.
దానికి ఎన్ఓసి కూడా ఉందని.అందులోనే వెళ్ళిపోవచ్చని సౌందర్య కి చెప్పాడు.దీనితో సౌందర్య అదే హెలికాప్టర్ లో హాయ్ గా వెళ్లిపోవచ్చని అనుకున్నారు.
అయితే ఆ హెలికాప్టర్ కి కేవలం 2 సీట్ కెపాసిటీ మాత్రమే ఉంది.ఈ విషయం తెలియని సౌందర్య, అమర్ నాథ్ మరియు పైలెట్ కూడా హెలికాప్టర్ ఎక్కారు.దీనితో హెలికాప్టర్ పై బాగా భారం పడింది.
అంతేకాదు సౌందర్య తన లాగేజి ని కూడా హెలికాప్టర్ లోకి ఎక్కించారు.దీనితో లోడ్ ఎక్కువై.
హెలికాప్టర్ కాస్త ఎత్తు ఎగరగానే వెంటనే కిందపడి క్షణాల్లోనే కాలి బూడిదయ్యింది.ఈ ప్రమాదంలో సౌందర్య, అమర్నాథ్ అక్కడిక్కడే చనిపోయారు.
అయితే సౌందర్య మరణానికి పరోక్షంగా అన్నీ విధాలా తానే కారణమని చిట్టిబాబు చెబుతుంటారు.