ధమాకాను భయపెడుతున్న అవతార్‌ రివ్యూలు

మాస్ మహారాజా రవితేజ హీరో గా త్రినాధ రావు నటించిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయినప్పటి నుండి కూడా రవితేజ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అంటూ ఎదురు చూశారు.

 Raviteja Dhamaka Movie Tension With Avatar 2 Movies , Avatar 2 Movies, Raviteja,-TeluguStop.com

సినిమాలోని పాటలు కూడా సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి.త్రినాధరావు నక్కిన గత సినిమాల నేపథ్యం లో ఈ సినిమా ఖచ్చితంగా మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అని.మాస్ మహారాజా అభిమానులకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు రవితేజ జోరుగా పాల్గొంటున్నాడు.వచ్చే వారంలో పెద్ద సినిమా ల పోటీ ఏమీ లేవు.సంక్రాంతి వరకు ఈ సినిమా జోరు కొనసాగించే అవకాశం ఉంటుంది.

పైగా క్రిస్మస్ సెలవుల కారణం గా ఈ సినిమా కు మంచి ఓపెనింగ్స్ ఉంటాయని అంత భావించారు.కానీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాలీవుడ్ సినిమా అవతార్ 2 రివ్యూలు చూసి ఇప్పుడు ధమాకా చిత్ర యూనిట్ సభ్యులకు కంగారుపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

అవతార్ 2 యొక్క ప్రభంజనం చూస్తూ ఉంటే కనీసం రెండు నుండి మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉంది.ఇలాంటి సమయం లో ధమాకా సినిమా వస్తే పాజిటివ్ టాక్ తగ్గించుకున్నప్పటికీ ఎక్కువ కలెక్షన్స్ రావేమో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

రవితేజ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా విడుదల తేదీ సరిగా లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి రవితేజ ను అవతార్ 2 భయపెడుతున్నట్లుగా సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube