విరూపాక్ష సక్సెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్న రవికృష్ణ... కారణం అదేనా?

సాధారణంగా ఒక సినిమాలో నటించిన సెలబ్రిటీలకు ఆ సినిమా ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తే ఎమోషనల్ అవుతూ ఉంటారు.ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు వారు నటించిన పాత్రలకు మంచి స్పందన రావడంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు.

 Ravikrishna Emotion In Virupaksha Success Meet Full Details Inside, Ravi Krishna-TeluguStop.com

ఈ క్రమంలోనే విరూపాక్ష సినిమా (Virupaksha Movie) మంచి సక్సెస్ కావడంతో బుల్లితెర నటుడు రవికృష్ణ (Ravi Krishna)సైతం ఎమోషనల్ అయ్యారు.బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ నటుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 3 కార్యక్రమంలో కూడా సందడి చేశారు.

Telugu Ravi Krishna, Sai Dharam Tej, Samyuktha Menon, Tollywood, Virupaksha-Movi

రవి కృష్ణ బుల్లితెర కార్యక్రమాలలోనూ బుల్లితెర సీరియల్స్ ద్వారా పెద్ద ఎత్తున సందడి చేసే ఈయన మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా వెండితెర సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇలా విరూపాక్ష సినిమాలో ఈయన నటించిన పాత్రనిడివి తక్కువే అయినప్పటికీ ఈయన పాత్రకు ఎంతో మంచి స్పందన రావడంతో ఒక్కసారిగా ఈయన ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సంయుక్త మీనన్ (Samyuktha Menon) జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరూపాక్ష సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది.అన్ని ప్రాంతాలలోను ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Telugu Ravi Krishna, Sai Dharam Tej, Samyuktha Menon, Tollywood, Virupaksha-Movi

ఇక ఈ సినిమాలో రవి కృష్ణ కూడా కీలక పాత్రలో నటించినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ క్రమంలోనే రవికృష్ణ తన పాత్ర గురించి తన పాత్రకు వస్తున్న స్పందన గురించి మాట్లాడుతూ తడబడటమే కాకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు.తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ దండుకు ఈ సందర్భంగా రవికృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి ప్రమాదం తర్వాత ఆయన నటించిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో అభిమానులు కూడా ఎంతోసంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube