రవితేజను కిందకు లాగే ప్రయత్నాలు చేస్తున్నది ఎవరు?

మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ధమాకా సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ధమాకా సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ఒక పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

 Raviteja Fans Fire On One Media House ,peoples Media Factory,dhamaka,dhamaka Mov-TeluguStop.com

ఇప్పుడు అదే వివాదానికి కారణం అయింది.ఒక మీడియా సంస్థ వారు ధమాకా సినిమా సక్సెస్ అయిన మాట వాస్తవమే కానీ వంద కోట్ల కలెక్షన్స్ మాత్రం నమోదు చేయలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు.దాదాపు రూ.65 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని ధమాకా సినిమా వసూలు చేసింది, కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం 100 కోట్ల కలెక్షన్స్ అంటూ హడావుడి చేస్తున్నారని వారు ఆరోపించారు.దాంతో రవితేజ అభిమానులు సదరు మీడియా సంస్థ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రవితేజ ను కిందికి లాగే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సదరు మీడియా పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిందని అధికారికంగా లెక్కలు చూపించడంతో పాటు అందుకు సంబంధించి ఐటీ కూడా చెల్లించారని రవితేజ అభిమానులు కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు.రవితేజ ఒక సామాన్య పరిస్థితుల నుండి ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన వ్యక్తి.

కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి ని ఇలా తొక్కేసేందుకు ప్రయత్నించవద్దని ఆయన ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నారని, ఆయన కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ధమాకా సినిమా సూపర్ హిట్ అని రూ.100 కోట్లు కలెక్షన్స్ ఇప్పటికే నమోదు చేసి మరో 20 కోట్ల కలెక్షన్స్ నమోదు చేయడం ఖాయమని మొత్తంగా 120 కోట్ల కలెక్షన్స్ ని ధమాకా సినిమా నమోదు చేయబోతుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.రవితేజ పై చిన్నచూపు చూడకుండా ఆయనను గౌరవించడం నేర్చుకోవాలంటూ సదరు మీడియా సంస్థ కి అభిమానులు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube