బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మోస్ట్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది రతికా రోజ్( Rathika Rose )ఈ ముద్దుగుమ్మ 4వ వారంలోనే ఎలిమినేట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు.ముఖ్యంగా రతిక ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది.
రతిక కూడా బాగా ఏడ్చేసింది.ఆమె చేసిన తప్పుల వల్లే ఎలిమినేట్ అయ్యింది కానీ బిగ్ బాస్ మళ్లీ ఆమెను హౌస్ లోకి తీసుకొచ్చాడు.
అయితే బయటికి వెళ్లిన తర్వాత ఆమె తన తప్పులను తాను తెలుసుకొని ఆటలో మెరుగ్గా ఆడుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఆమె లోపలికి వెళ్లి చేస్తున్న పని చూసి ఇప్పుడు షాక్ అవుతున్నారు.
రతిక హౌస్ లో వెళ్లిన తొలిరోజే శివాజీ కాళ్ళ మీద పడి తనను క్షమించాలంటూ బతిమిలాడుకుంది.ఆ తర్వాత ప్రిన్స్ యావర్ మద్దతు కోసం పాకులాడింది.చివరికి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) దగ్గర కూడా ఆమె తన ఆత్మగౌరవం పక్కనపెట్టి ప్రవర్తించడం ప్రారంభించింది.పల్లవి ప్రశాంత్ వద్ద గుక్క పెట్టి ఏడుస్తూ మనం ఫ్రెండ్స్ అయిపోదాం అంటూ ఆమె ప్రవర్తించిన తీరు అందరికీ షాక్ ఇచ్చింది.
మరీ ఎందుకంత బతిలాడే స్టేజ్ కి వెళ్ళిపోవాలి? ఎవరు ఆట వారు చక్కగా ఆడితే గెలుస్తారు కదా? ప్రతి ఒక్కరి కాళ్లా వేళ్లా పడి మరీ అడుక్కోవలసిన పరిస్థితికి ఎందుకు దిగజారాలి? అనే ప్రశ్నలు సగటు ప్రేక్షకుడిలో ఇప్పుడు తలెత్తుతున్నాయి.
అయితే ఒక కంటెస్టెంట్ గా కూడా ఉండలేని రతిక అభిప్రాయాలను బిగ్ బాస్ పరిగణలోకి తీసుకుంటూ ఆడియన్స్‌ను మరింత షాక్‌కు గురి చేస్తున్నాడు.తన ఆట తనే ఆడుకోలేని స్థితిలో ఉన్న రతికను కెప్టెన్ ఎవరో ఎంపిక చేయాలంటూ బిగ్ బాస్ బుజ్జగిస్తున్నాడు.ఆమె నిర్ణయానికి వాల్యూ ఇస్తానని ఇన్‌డైరెక్టుగా చెప్పకనే చెప్తున్నాడు.
ఇంకొక లాజిక్ కూడా ఇక్కడ మిస్ అవుతోంది.కెప్టెన్ ఎవరు కావాలో రతికనే నిర్ణయించాలని అంటున్నారు.
అలాంటప్పుడు కెప్టెన్సీ రేసు అంటూ పోటీలు ఎందుకు నిర్వహించారు? ఆ లాజిక్ బిగ్ బాస్ కే అర్థం కావాలి.నిజానికి కెప్టెన్ ను ఎంచుకునే విషయంలో బిగ్ బాస్ తెలివి తక్కువగా వ్యవహరించాడు.
ఈసారి కంటెస్టెంట్స్ ఎంత చెత్తగా ఆడుతున్నారో వారి ప్రవర్తన ఎంత బ్యాడ్ గా ఉందో బిగ్ బాస్ నిర్ణయాలు కూడా అదే స్థాయిలో తెలివి తక్కువగా ఉన్నాయి. శివాజీ( Shivaji ) మంచి ఆటగాడు కానే కాదు.
అయినా ప్రేక్షకులు అతడిని నెత్తిన పెట్టుకుంటున్నారు.ఇవన్నీ పరిశీలిస్తుంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని తెలుస్తోంది.