సిమిలాపాల్ లో అరుదైన నల్లపులి.. ఏం చేస్తుందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

పెద్దపులి, చిరుత పులి.ఇలా మనకు చాలానే పులులు తెలుసు.

 Rare Black Tiger In Similapal National Park Video Goes Viral , Black Tiger , R-TeluguStop.com

కానీ నలుపు రుంగులో ఉన్న పులిని మాత్రం ఎక్కువగా చూసి ఉండరు.కొంత మందికి అసలు ఆ నల్ల పులి ఉంటుందన్న విషయం కూడా తెలియదనుకుంటా.

కానీ నల్ల పులులు ఉంటాయి.అది కూడా చాలా అరుదుగా.

నల్ల పులులు కేవలం ఒడిశాలోని సిమిలాపాల్ నేషనల్ పార్కులో మాత్రమే ఉంటాయి.ప్రస్తుతం అక్కడి పార్కులో కనిపించిన ఓ నల్లపులి వీడియో వైరల్ గా మారింది.

దీనిని సుషాంత్ నంద అనే వ్యక్తి జులై 29వ తేదీ 2022న షేర్ చేశారు.నల్లగా ఉండే ఈ పులికి నారింజ రంగు చారలు ఉన్నాయి.

ఈ అరుదైన నల్లపులి తను రెగ్యులర్‌గా తిరిగే ప్రాంతాన్ని ఈజీగా గుర్తిస్తుంది.

అయితే ఈ వీడియోలో ఆ పులి ఓ చెట్టు బెరడును తీసేస్తూ….

ఏదో చేస్తుంది అనుకుంటారు చూసే వాళ్లు.కానీ ఆ పులి అదంతా తన భూభాగం అని వేరే పులులకు తెలిసే విధంగా గుర్తులు వేస్తోంది.

చెట్టు బెరడను పీకేస్తూ… తన మార్క్ వేస్కుంటుంది.ఈ గుర్తుల వల్లే తన లాంటి మరో పులి ఆ ఏరియాలో ఉందని.

అది ఆ పులి అడ్డా అని పులులు తెలుసుకుంటాయి.అయితే పులులు నల్లగా మారేందుకు కారణం ట్రాన్స్ మెంబ్రెన్ అమినోపప్టిడేస్ క్యూ అనే జన్యువు ఉత్పరివర్తనం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

దీని వల్లే ఈ పులులకు నలుపు రంగు వచ్చినట్లు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube