వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ విషయం లో మాట్లాడినా కూడా చాలా లోతుగా మాట్లాడతాడు అనే అభిప్రాయం అందరిలో ఉంది.ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏదైనా విషయం పై మాట్లాడేటప్పుడు ఆసక్తిగా వింటారు అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల సమ్మె జరుగుతోంది.సమ్మె లో భాగంగా టాలీవుడ్ నిర్మాతలు షూటింగ్ లను పూర్తి గా నిలిపి వేశారు.
పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని కాకుండా ప్రతి ఒక్క సినిమా షూటింగ్ ను కూడా నిలిపి వేయడం తో సినీ కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.ఇప్పటికే విడుదల తేదీ ఫిక్స్ అయిన సినిమాల విడుదల తేదీల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మరో వైపు ఇండస్ట్రీ లోని పలు వర్గాల వారు ఈ సినిమా నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మ టాలీవుడ్ నిర్మాతల యొక్క సమ్మె పై ఒక టీవీ చానల్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఆ సందర్భంగా నిర్మాతలపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఒక సినిమా ను నిర్మించి దాని మార్కెట్ చేసుకుని లాభాలు పొందలేని నిర్మాతలు ఇలా ఆందోళనలు చేస్తున్నారని, వారికి సాధ్యమైనంత మేరకు బడ్జెట్ పెట్టి దాని బిజినెస్ చేసుకోవాలి తప్పితే సినిమా ని తక్కువ బడ్జెట్లో చేస్తే ఎక్కువ లాభాలు రావాలి అంటూ ఆలోచన చేయడం అవివేకం అవుతుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు.
రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సినిమా నిర్మాతలు బడ్జెట్ విషయం లో ముందుగానే ఒక ప్లాన్ తో ఉండాలి, వారు ఆ ప్లాన్ తో వెళ్లకుండా బడ్జెట్ ని ఎక్కువ చేసి లాభాలు రాక నష్టపోయి అప్పుడు ఆందోళన చెందడం కంటే ముందుగానే తమకు ఈ బడ్జెట్ సాధ్యమవుతుంది అనుకున్నప్పుడు సినిమా చేయాలని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ అభిప్రాయం పై సినీ నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి.







