మళ్లీ అలియాభట్ రణ్ బీర్ కలిసి నటిస్తారా.. సూపర్ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్‌ కపూర్,అలియా భట్ ల జంట గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల ఈ జంట వైవాహిక బంధంతో ఒకటయ్యారు.

 Ranbir Kapoor-alia Bhatt On Rumours Of Signing Rom-com Their Next Film Together,-TeluguStop.com

అంతేకాకుండా ఆలియా భట్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.ఇక ఇది ఇలా ఉంటే ఈ జంట తాజాగా కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించింది.పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.

పెళ్లయిన తర్వాత కూడా ఈ జంట కలిసిన నటించిన చిత్రం ఇదే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంటకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేమిటంటే అలియా భట్,రణ్‌బీర్‌ కపూర్ లు మరొక సినిమాలో కలిసిన నటిస్తున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.వీరిద్దరూ కలిసి మరొక రొమాంటిక్ కామెడీ సినిమాలు నటించబోతున్నట్లు వార్తలు వినిపించగా ఆ విషయంపై తాజాగా ఈ జంట స్పందించారు.

తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంట ఈ విషయం గురించి స్పందిస్తూ ఆ వార్తలకు చెక్ పెట్టేశారు.ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ కపూర్ మాట్లాడుతూ మా ఇద్దరి నిజ జీవితంలో సరదాగా ఉన్నాము.

Telugu Alia Bhatt, Aliabhatt, Alia Interview, Bollywood, Brahmastra, Ranbir Kapo

ప్రస్తుతానికి మేమిద్దరం వేరే సినిమాలో నటించడం లేదు అని తెలిపారు రణ్‌బీర్‌.అనంతరం అలియా భట్ కూడా మాట్లాడుతూ నేను రూమర్ల గురించి విన్నాను.కానీ మా తరువాత చిత్రం బ్రహ్మస్త్ర పార్ట్‌ -2 మాత్రమేనని తేల్చేసింది.బ్రహ్మస్త్ర కాకుండా అయాన్ ముఖర్జీ ఇతర సినిమాల్లో నటించడానికి అనుమతి ఇస్తారో లేదో తెలియదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

అయితే రణ్‌బీర్‌, అలియా కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు అన్న వార్తను నిజమే కానీ అది బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో మాత్రమే ఇతర వేరే సినిమాలలో కాదు అని ఈ జంట స్పష్టతనిచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube