బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రణవీర్ సింగ్ ( Ranaveer Singh ) దీపిక పదుకొనే ( Deepika Padukone ) జంట ఒకటి అని చెప్పాలి.వీరిద్దరూ కూడా ప్రేమించుకొని దాదాపు ఆరు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న అనంతరం పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.
ఇలా పెళ్లి తర్వాత కూడా దీపిక రణవీర్ ఇద్దరూ కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.ఇకపోతే తాజాగా ఈ దంపతులు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్( Coffee With Karan ) టాక్ షోకి ముఖ్య అతిథులుగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ ఎన్నో విషయాలను వెల్లడించారు.తమ ప్రేమా పెళ్లి గురించి అలాగే ఈమె ఒకానొక సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయినటువంటి సంఘటనలను కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. దీపిక పదుకొనే( Deepika Padukone ) ఇదివరకు పలు సందర్భాలలో తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని సమయంలో తన తల్లి తనని గుర్తించి తన సమస్యను తీర్చింది అంటూ చెప్పుకొచ్చారు.కానీ ఇప్పటివరకు ఈమె డిప్రెషన్ గురించి తన భర్త రణవీర్ ఎప్పుడు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు.
మొదటిసారి ఈ షో ద్వారా దీపిక పదుకొనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయినటువంటి సంఘటనల గురించి ఈయన తెలిపారు.
ఈ సందర్భంగా రణవీర్ మాట్లాడుతూ దీపిక డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమయంలో చాలా బాధపడింది ఎంతో ఆవేదన చెందేది.తనకు ఎంత చెప్పినా తన తీరు మార్చుకోలేకపోయింది.అంత బాధ పడుతూ ఉండగా నేను నిస్సహాయ స్థితిలో ఉండిపోయానని, ఏం చేయాలో దిక్కు తెలియక తన తల్లిదండ్రులకు కబురు పెట్టాను.
డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం చాలా భయంకరమైనటువంటి విషయం.దీని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, డిప్రెషన్ లో ఉన్నవారికి కౌన్సిలింగ్ తప్పనిసరి అవసరమని రణవీర్ తెలిపారు.
అలాగే డిప్రెషన్ లో ఉన్న వారిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.