గుడ్డులోని పచ్చ సొన తింటే ఆరోగ్యానికి మంచిదేనా..?

గుడ్డు( egg ) ఆరోగ్యానికి మంచిదని దాదాపు చాలామందికి తెలుసు.చాలా మంది గుడ్డు రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటారు.

 Is It Good For Health If You Eat The Egg Yolk , Hematological Profiles, Yolk , E-TeluguStop.com

అయితే చాలా మంది గుడ్డులోని తెల్ల సొన మాత్రమే తిని పచ్చ సొనను వదిలేస్తూ ఉంటారు.ఎందుకంటే పచ్చ సోనా( yolk ) మంచిది కాదని చాలా మంది నమ్ముతూ ఉంటారు.

గుడ్డులోని పచ్చ సోనా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని భ్రమపడేవారు ఎంతోమంది ఉన్నారు.ముఖ్యంగా చెప్పాలంటే కోడి గుడ్డు పచ్చ సున్నా తినవచ్చా? తినకూడదా? అనే సందేహానికి తాజాగా యూనివర్సిటీ కనెక్టికట్ సైంటిస్టులు జరిపిన పరిశోధనతో ఫుల్‌స్టాప్‌ పడింది అని చెబుతున్నారు.ఇంతకీ ఆ అధ్యయనంలో ఏం తేలింది అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Yolk-Telugu Health Tips

ముఖ్యంగా చెప్పాలంటే సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు బ్రేక్ ఫాస్ట్ లో చాలామంది గుడ్డు తినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఉడకపెట్టిన గుడ్లు,ఆమ్లెట్ ఫ్రై ఇలా అనేక రూపాల్లో తీసుకుంటూ ఉంటారు.పచ్చ సోనాను తీసుకోవడం అంతగా ఇష్టపడరు.

దీని వల్ల కొలెస్ట్రాల్ సాయి పెరుగుతుందని భావించేవారు ఎంతోమంది ఉన్నారు.తాజాగా ఇదే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు.

ఇందులో 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న 28 మంది ఆరోగ్యవంతులను ఈ రీసెర్చ్ కోసం ఎంచుకున్నారు.వీళ్ళలో కొందరికి కేవలం ఎగ్‌ వైట్‌ తినేలా, మరి కొందరిని పచ్చ సోన తినేలా, మరి కొంతమందికి గుడ్డు మొత్తం తినేలా మిగిలిన వాళ్ళకి గుడ్లు లేని ఆహారం అందించారు.

Telugu Tips, Yolk-Telugu Health Tips

నాలుగు వారాల తర్వాత వారి డైట్ ను బట్టి జీవక్రియ హెమటోలాజికల్ ప్రొఫైల్‌ల పై( hematological profiles ) గుడ్డు ప్రభావాన్ని పరిశీలించారు.వీరిలో మొత్తం గుడ్డు తిన్న వారి శరీరంలో కోలిన్‌ అనే పోషకం గననీయమైన పెరుగుదలను చూపించిందని పరిశోధకులు తెలుసుకు న్నారు.కొలిన్ మెదడు నాడి వ్యవస్థ, జ్ఞాపక శక్తి, మానసిక స్థితికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతే కాకుండా ఇది ట్రై మిథైలామైన్ N-ఆక్సైడ్ ని ఉత్పత్తి చేస్తుంది.సాధారణంగా గుడ్డు తింటే కొవ్వు పెరిగి గుండె పై ప్రభావం చూపుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు.కానీ సైంటిస్టులు జరిపిన ప్రయోగం ప్రకారం మొత్తం గుడ్డు తిన్న వారిలో TMAO మారలేదని పరిశోధకులు తెలుసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube