తెలంగాణపై రాహుల్ ఫోకస్ ! బస్సు యాత్రకు ప్లాన్

తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) ను అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు దానికి అనుకూలంగానే ఎప్పటికప్పుడు తమ రాజకీయ వ్యవహారాలను మార్చుకుంటున్నారు ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు బస్సు యాత్రకు ప్లాన్ చేశారు ఇప్పటికే రాహుల్ గాంధీ,( Rahul Gandhi )  సోనియా( Sonia Gandhi ) ప్రియాంక గాంధీలతో పాటు, కర్ణాటక కాంగ్రెస్ కీలక నేతలు తెలంగాణ పై ఫోకస్ చేశారు. తెలంగాణలో భారీ సభలు ,సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేసేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు అంతా సిద్ధమవుతున్నారు.

 Rahul's Focus On Telangana! Plan A Bus Trip , Telangana Congress, Bjp, Br-TeluguStop.com
Telugu Dk Siva Kumar, Priyanka Gandhi, Rahul Gandhi, Sonia Gandhi, Telangana-Pol

ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే బస్సు యాత్ర( bus trip )లో ప్రియాంక గాంధీ , రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు .మూడు రోజులపాటు రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారు.ప్రియాంక గాంధీ కూడా ఈ యాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.అనధికారికంగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక గాంధీ,( Priyanka Gandhi )  కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా తెలంగాణ వ్యవహారాలను చెక్కబడుతున్నారు .ఇక నేరుగా రాహుల్ గాంధీ తెలంగాణ లో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల చేతుల మీదుగా బస్సు యాత్ర నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు .

Telugu Dk Siva Kumar, Priyanka Gandhi, Rahul Gandhi, Sonia Gandhi, Telangana-Pol

ఆ యాత్రలోనే కాంగ్రెస్ అగ్ర నేతలు అంతా పాల్గొనబోతున్నారు.ఈనెల 19 ,20, 21 తేదీల్లో బస్సు యాత్రలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పాల్గొనే విధంగా షెడ్యూల్ రూపొందించారు.ఆ తేదీల్లోగా తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన పూర్తవడంతో పాటు,  ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అంచనా వేస్తున్నారు.అందుకే ఉత్తర తెలంగాణలో పార్టీకి ఊపు వచ్చే విధంగా రాహుల్ బస్సు యాత్ర చేపట్టనున్నారట.

అలాగే ఈ నెల 10వ తేదీన గాంధీభవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతుంది.ఏఐసీసీ అగ్రి నేతలతో పాటు , తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) వ్యవహకర్త సునీల్ కానుగోలు తదితరులు హాజరై తెలంగాణలో కాంగ్రెస్ ను ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలనే విషయం పైన చర్చించనున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube