స్టార్ హీరో ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాలతో మార్కెట్ పెరిగిన తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మార్కెట్ ను పెంచుకోవడంపై దృష్టి పెట్టారు.ప్రభాస్ వరుసగా సినిమాల్లో నటిస్తుండగా మొదట రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది.
ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుండగా పదిరోజుల షూటింగ్ మినహా ఈ సినిమా దాదాపుగా పూర్తి కావడం గమనార్హం.
![Telugu Hindi Satellite, Prabhas, Radhe Shyam-Movie Telugu Hindi Satellite, Prabhas, Radhe Shyam-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/05/radhe-shyam-movie-hindi-satellite-rights-detailslatest-news-tollywood.jpg )
క్లాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ హిందీ టార్గెట్ 120 కోట్లు అని ఈ సినిమా హిందీ బిజినెస్ ఇంతే మొత్తానికి జరిగిందని తెలుస్తోంది.ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్లే సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని సమాచారం.ప్రభాస్ గత సినిమా సాహోకు బాలీవుడ్ క్రిటిక్స్ నెగిటివ్ రివ్యూలు ఇచ్చినప్పటికీ థియేట్రికల్ కలెక్షన్లు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.
కరోనా విజృంభణ తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటే మాత్రం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కు రాధేశ్యామ్ 150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.ఫ్లాప్ టాక్ వచ్చినా సాహో హిందీలో రికార్డులు సృష్టించగా రాధేశ్యామ్ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్ల వర్షం గ్యారంటీ అని చెప్పవచ్చు.
మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది.
![Telugu Hindi Satellite, Prabhas, Radhe Shyam-Movie Telugu Hindi Satellite, Prabhas, Radhe Shyam-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/05/radhe-shyam-movie-hindi-satellite-rights-detailslatest-news.jpg )
అయితే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు సంబంధించిన డీల్ ఫైనలైజ్ కావాల్సి ఉంది.ఒకే ఒక్క సినిమా దర్శకత్వ అనుభవం ఉన్న రాధాకృష్ణ కుమార్ ప్రభాస్ ను ఒప్పించి ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
జులై నెల చివరి వారంలో ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా ఆ తేదీకే ఈ మూవీ రిలీజవుతుందో లేదో చూడాల్సి ఉంది.