ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి అల్లు అర్జున్ పుష్ప సినిమా( Pushpa ) లో నటించి ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన పుష్ప సినిమాలోని తన నటనతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు.
ఇలా ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చిత్ర బృందంపై మరింత బాధ్యతలు పెరిగాయి.దీంతో పుష్ప 2( Pushpa 2 )సినిమా పట్ల ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నారు.ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు.
కానీ ఈ సినిమాలో కేశవ పాత్ర( Keshava )లో నటించిన నటుడు అరెస్టు కావడంతో సినిమా వాయిదా పడుతుంది అంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి.
ఇలా ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ వస్తున్నటువంటి వార్తలపై తాజాగా చిత్ర బృందం స్పందించే క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలోనే బన్నీ డిజిటల్ టీం ఈ వార్తలపై స్పందిస్తూ.అనుకున్న సమయానికే పుష్పరాజ్ ర్యాంపేజ్( Pushparaj Rampage ) ఖాయం అని ట్వీట్ చేశారు.
ఇక ఈ సినిమా విడుదలపై సుకుమార్ కూడా స్పందిస్తూ.ఇంకా 200 రోజుల్లో పుష్పరాజ్ రూల్స్ ప్రారంభం కానున్నాయంటూ ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి పోస్టర్స్ వరల్డ్ గా మారడంతో పుష్పరాజ్ ఆగమనం మొదలైంది అంటూ అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు.
మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.