Allu Arjun ,Pushpa 2 : పుష్ప 2 డైలాగ్ లీక్ చేసిన బన్ని.. అస్సలు తగ్గేదేలే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ముందు వరకు కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.

 Pushpa 2 Dialogue Leaked Banni Will It Be Reduced At All ,pushpa 2 ,allu Arjun,-TeluguStop.com

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఈ సినిమా సీక్వెల్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ విడుదలైనప్పటికీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజాగా తన తమ్ముడు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన తండ్రి తన తమ్ముడితో ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు.

అదేవిధంగా తన స్నేహితుడు బన్నీ వాసు గురించి కూడా అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది అభిమానులు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా చెబితే వినాలని ఉంది అంటూ ఆరాట పడ్డారు.

Telugu Allu Arjun, Allu Sirish, Bunny Vasu, Pushpa-Movie

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అభిమానుల కోసం పుష్ప 2 సినిమా గురించి చిన్న అప్డేట్ విడుదల చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ ఈయన పుష్ప 2 గురించి ఏం చెప్పారనే విషయానికి వస్తే.పుష్ప సినిమాలో తాను చెప్పిన డైలాగ్ తగ్గేదేలే ఎలా హిట్ అయిందో మనకు తెలిసిందే.అయితే పుష్ప2 లో మాత్రం అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్ ఉండబోతుంది అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సినిమా గురించి అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ అస్సలు తగ్గకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube