నేడు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ( Prime Minister Modi ) కీలక వ్యాఖ్యలు చేశారు.దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ( NDA ) కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఎన్డీఏ ఏర్పాటులో అద్వానీ ప్రధాన భూమిక పోషించారని పేర్కొన్నారు.ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో నేడు జరిగిన ఈ సమావేశంలో ఎన్డీఏలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు.25 ఏళ్ల నుంచి ఎన్డీఏ దేశ సేవలో ఉందని పేర్కొన్నారు.ఎన్డీఏ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చమని పేర్కొన్నారు.
రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు.
వచ్చే 25 ఏళ్ల ప్రణాళికతో ప్రగతి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.తమ ప్రభుత్వ హయాంలో ₹13.5 కోట్ల మంది దారిద్యరేఖ దిగువ ఉన్నవారు పైకి వచ్చారని లెక్కలు వివరించారు.ప్రణబ్ ముఖర్జీకి( Pranab Mukherjee ) భారతరత్న ఇచ్చిన ఘనత ఎన్డీఏకే దక్కుతుందని.
ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరుస్తున్నట్లు స్పష్టం చేశారు.ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశామని గాంధీ, అంబేద్కర్, లోహియా సిద్ధాంతాలను ఆచరిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రసంగించారు.