తెలుగు రాష్ట్రాలలో ప్రధాని మోడీ పర్యటన సంచలనం రేపుతుంది.ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏయూ గ్రౌండ్స్ లో భారీ జన సందోహం మధ్య జరిగిన సభలో మోడీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
విశాఖపట్నం కేంద్రంగా ఎప్పటినుండో వ్యాపారం జరుగుతుందని.విశాఖ గొప్పతనాన్ని కీర్తించారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చాలామంది అనేక రంగాలలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని పొగిడారు.అయితే విశాఖలో పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
విమానశ్రయంలో ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్, బీజేపీ నేతలు రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి, డీకే అరుణ తదితరులు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ బీజేపీ కార్యకర్తలపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.
తెలంగాణ బీజేపీ కార్యకర్తల పోరాటం తనలో ఎంతో స్ఫూర్తిని నిలిపిందని పేర్కొన్నారు.

త్యాగం మరియు ధైర్యంతో అన్యాయాలపై పోరాటం చేస్తున్నారని అభివర్ణించారు.నిరాశలో ఉన్న ప్రభుత్వం మీపై యుద్ధం చేస్తుంది.అయినా సరే మీరు వెనకడుగు వేయడం లేదు.
తెలంగాణ పేరుతో కొంతమంది అధికారం పొంది.ప్రజలకు అన్యాయం చేసి జేబులు నింపుకుంటున్నారు.
ఇక ఇదే సందర్భంలో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా అంటూ మోడీ స్పష్టం చేశారు.