కొంత మంది ఫేమస్ కావడానికి ఏండ్ల తరబడి కష్టపడతారు.ఆయా రంగాల్లో తమ సత్తా చాటుకుంటారు.
విజేతగా నిలుస్తారు.మరికొందరు సడెన్ గా ఫేమస్ అవుతారు.
వారు అంతకు ముందు ఏదో పని చేసినా.చిన్న చిన్న కారణాలతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోతారు.
అలా సడెన్ గా నేషన్ క్రష్ ఆఫ్ ఇండియా మారారు కొందరు ముద్దుగుమ్మలు.ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ప్రియా ప్రకాష్ వారియర్
ఈ కేరళ కుట్టి రాత్రికి రాత్రే దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.ఒక్క పాటతో జనాల మతులు పోగొట్టింది.ఒక పాటలో కన్నుకొట్టే షాట్ ఏడాదంతా నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో నిలిచింది.
సాక్షి మాలిక్
ఈ బాలీవుడ్ బ్యూటీ కూడా ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.సోనూ కే టిటు కి స్వీటీ సినిమాలో సాంగ్ ద్వారా ఓ రేంజిలో పాపులారిటీ సాధించింది.
షిర్లే సేటియా
యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ ద్వారా షిర్లే సేటియా మస్త్ పాపులారిటీ సాధించింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాగశౌర్య సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.హిందీలో లో జెంటిల్మెన్ సినిమాలో ఓ సాంగ్ కూడా పాడింది.
రష్మికా మందాన
కిరాక్ పార్టీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఈ ముద్దుగుమ్మ.తన తొలి సినిమాతోనే అందంతో అందరినీ కట్టి పడేసింది.తన క్యూట్ లుక్స్ తో గతేడాది ఫుల్ పాపులర్ అయ్యింది.
దిశా పటాని
ఎమ్మెస్ ధోనీ సినిమాతో దిశా పటాని ఓ రేంజిలో పాపులారిటీ సాధించింది.గతంలో సినిమాలు చేసినా.ఈ మూవీతో మంచి పేరు సంపాదించింది.
స్మృతి మందాన
టీమిండియా క్రికెటర్ స్మృతి మందాన కూడా ఒక మ్యాచ్ తర్వాత చాలా ఫేమస్ అయ్యింది.తన అందంతో పాటు ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది.
సంజన సంఘీ
దిల్ బేచారా లో హీరోయిన్ గా నటించింది సంజన.ఈ ఒక్క సినిమాతో తను ఫుల్ పాపులర్ అయ్యింది.అంతకు ముందు చాలా సినిమాలు, యాడ్స్ చేసింది.అయినా అంత గుర్తింపు రాలేదు.
మౌమినా
రాహత్ ఫతే అలీ ఖాన్ తో పాటు కలిసి ఆఫ్రీన్ పాట పాడిన మౌమినా ఓవర్ పైట్ స్టార్ అయ్యింది.ఎన్టీవీ కోక్ స్టూడియో లో వీరు ఈ పాటను పాడారు.
మానుషి చిల్లర్
2017లో మిస్ ఇండియా టైటిల్ కొట్టింది మానుషి.ఈ విజయంతో తను రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.