నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న బింబిసార సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా నిలిచి పోయింది.మళ్లీ షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సమయంలోనే ఈ సినిమా బడ్జెట్ గురించి ప్రస్తుతం నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బింబిసార సినిమా చిత్రీకరణ కోసం ఏకంగా 150 కోట్ల ను నందమూరి కళ్యాణ్ రామ్ ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాల పాటు సమయం ను కేటాయించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.బింబిసార సినిమా కోసం కళ్యాణ్ రామ్ చేస్తున్న ఖర్చు ఒక్క సారిగా రావడం అంటే అసాధ్యం.
అందుకే ఆ సినిమా కోసం ఏకంగా కళ్యాణ్ రామ్ మాస్టర్ ప్లాన్ తో మూడు పార్ట్ ల నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.బింబిసార సినిమా ను మూడు పార్ట్ లు గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
బింబిసార సినిమా కోసం నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ స్టార్స్ ను నటింపజేయబోతున్నారట.ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన మూడు పార్ట్ ల స్క్రీన్ ప్లేను ప్లాన్ చేస్తున్నాట, పార్ట్ కు 50 కోట్ల వరకు బిజినెస్ చేసినా కూడా కళ్యాణ్ రామ్ సక్సెస్ అయినట్లే అంటున్నారు.అయితే మొదటి పార్ట్ నిరాశ పర్చితే తదుపరి రెండు పార్ట్ లకు కనీసం ప్రమోషన్ ఖర్చులు కూడ ఆ వచ్చే అవకాశం లేదు అంటున్నారు.అందుకే ఒక పార్ట్ ను మించి మరో పార్ట్ అన్నట్లుగా రెండు మూడు పార్ట్ ల్లో మరింత గా ఆకర్షణను ఉంచబోతున్నారట.
తద్వార ఖచ్చితంగా మూడు పార్ట్ లు కూడా మినిమం వసూళ్లను దక్కించుకుంటుందని అంటున్నారు.అందుకే కళ్యాణ్ రామ్ చాలా నమ్మకంతో అంత ఖర్చు పెడుతున్నాడని అంటున్నారు.ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.కనుక బింబిసార రెండు పార్ట్ లు ఎప్పుడు వస్తుంది.
చివరి పార్ట్ కు సంబంధించిన విషేషాలు ఏంటీ అనేది చూడాలి.