ప్రణీత సుభాష్ ఏంటి ఇలా మారిపోయింది.. కళ్ళు, ముక్కు అని వంకరే అస్సలు గుర్తుపట్టలేముగా?

కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తొలిసారిగా ఏం పిల్లో.

 Pranitha Subhash Posted Pic With Weird Filter Viral Details, Praneetha Subhash,p-TeluguStop.com

ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ అతి తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.

అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలా బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించింది.

కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.కానీ ఏ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కంటే వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకుంది.ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ ప్రతిరోజు సహాయం చేస్తూనే ఉంటుంది.

గతంలో కరోనా సమయంలో కూడా ఎంతో సహాయంతో ముందుకు వచ్చింది.ఇక ఈమె బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను వివాహం చేసుకుంది.

ఇక పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టాక సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చింది.

Telugu Nithin Raj, Prabithasubhash, Pranitha, Pranithasubhash-Movie

పైగా ఆ మధ్యనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.పాప పుట్టిన తర్వాత కూడా తన ఫిజిక్ లో ఎటువంటి మార్పులు లేవని చెప్పవచ్చు.

ఇంకా తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ సోషల్ మీడియాలో వాటిని బాగా పంచుకుంటూ ఉంటుంది.

అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక ప్రణీత ఎంత హీరోయిన్ అయినా కూడా తను మాత్రం తమ పద్ధతులను బాగా పాటిస్తుంది.

చాలా వరకు అవి సోషల్ మీడియా ద్వారా బయటపడుతూ ఉంటాయి.

Telugu Nithin Raj, Prabithasubhash, Pranitha, Pranithasubhash-Movie

ఒక వైపు తన బిజినెస్ లు చూసుకుంటూ మరోవైపు ఫ్యామిలీని చూసుకుంటుంది ప్రణీత.ఇక సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం బాగా టచ్ లో ఉంటుంది.అయితే అప్పుడప్పుడు తన షేర్ చేసుకునే ఫోటోలు బాగా సరదాగా ఉంటాయి.

అంటే రకరకాల ఫిల్టర్స్ తో ఫోటోలు దిగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను ఇన్ స్టాలో ఓ ఫోటో షేర్ చేసుకుంది.

అందులో ప్రణీత అంటే గుర్తు పట్టడం చాలా కష్టం.ఎందుకంటే అందులో తన కళ్ళు, ముక్కు చాలా వంకరగా కనిపించాయి.

దీంతో ఆ ఫోటో చూసిన నెటిజన్స్.ప్రణీత ఏంటి ఇలా మారిపోయింది అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటో మాత్రం బాగా హల్చల్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube