తెలుగు సిని ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్, చెన్నై బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కాగా త్రిష ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
వర్షం సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.తెలుగులో ఈ సినిమా తర్వాత త్రిష కు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.
ఇక వర్షం సినిమా త్రిష కెరియర్ లో ఇటు ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.తెలుగులో కూడా దాదాపుగా స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది త్రిష.
కొంతకాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత తమిళంలో అవకాశాలు అందుకుని అక్కడికి వెళ్లిపోయింది.
ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ తమిళంలో వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
ఇది ఇలా ఉంటే హీరోయిన్ త్రిష కు సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి తండ్రిగా మామగా బాయ్ ఫ్రెండ్ గా కూడా నటించాడట.అతను ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అతను మరెవరో కాదు.టాలీవుడ్ వర్డ్స్ స్టైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్.
త్రిష నటించిన తెలుగు సినిమా వర్షం, ఆకాశమంత అలాగే ఇటీవల విడుదలైన పొన్నియిన్ సెల్వన్ సినిమాలలో ప్రకాష్ రాజు, త్రిష తండ్రిగా నటించాడు.అదేవిధంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సిద్ధార్థ్ కు తండ్రిగా అంటే త్రిషకు మామగా నటించాడు.
అదేవిధంగా అలాగే మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా తమిళ్ రీమేక్ లో గిల్లి లో ఆమె బాయ్ ఫ్రెండ్ గా నటించాడు ప్రకాష్ రాజ్.ఇలా ప్రకాష్ రాజ్ త్రిష కు మామగా,బాయ్ ఫ్రెండ్ గా, తండ్రిగా నటించాడు.ఇకపోతే ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన త్రిష ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.ఈ సినిమాతో పాటుగా రాంగీ అనే సినిమాలో కూడా నటించింది.
త్రిష సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే అందంతో కట్టిపడేయడంతో పాటు వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.