మాజీఎంపీ హరిరామ జోగయ్య రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.కాపులకు రిజర్వేషన్ల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జోగయ్య దీక్ష నిర్వహించనున్నారని సమాచారం.
పాలకొల్లులో రేపు ఉదయం 9 గంటలకు దీక్షను ప్రారంభించనున్నారు.పోలీసులు తన దీక్షను భగ్నం చేసినా సరే దీక్ష కొనసాగిస్తానని హరిరామ జోగయ్య తెలిపారు.