సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రభుత్వాలను ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్న మనిషిని అందరికీ తెలుసు.ఒకపక్క తన చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేస్తూ మరోపక్క తెలంగాణలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.
సినిమాలు చేస్తున్న ప్రకాష్ రాజ్ తాజాగా తెలంగాణలో మోడీ పర్యటనపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.
డియర్ సుప్రీం లీడర్.
హైదరాబాద్ కి మీకు స్వాగతం.బీజేపీ పాలిత రాష్ట్రాలలో పన్ను కట్టే డబ్బులతో మీ పర్యటనలకు అక్కడ పాలకులు మీ కోసం రోడ్లు వేస్తారు.
కానీ తెలంగాణలో అదే పన్నుతో ప్రజల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు.మీ హైదరాబాద్ పర్యటనలో దూర దృష్టితో.
మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో.నేర్చుకుంటారని ఆశిస్తున్నాను అంటూ తనదైన శైలిలో ప్రకాష్ రాజ్ కామెంట్లు చేశారు.
ఈ క్రమంలో కాలేశ్వరం ప్రాజెక్ట్, యాదాద్రి, టీ హబ్ ఫోటో లను షేర్ చేయడం జరిగింది.