తెలుగు సినిమా ఇండస్ట్రీలో భక్తకన్నప్ప అన్న పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు దివంగత హీరో కృష్ణంరాజు.అయితే ఈ సినిమాని డార్లింగ్ ప్రభాస్ తో రీమేక్ చేయాలి అని రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఎన్నో కలలు కూడా కన్నారు.
మరొకవైపు ఈ సినిమాపై ఎప్పటినుంచో మోహన్ బాబు ఫ్యామిలీ కూడా ఒక కన్నేసి ఉంచింది.ఇక మంచి ఫ్యామిలీ అనుకున్నట్లుగానే మంచు విష్ణు హీరోగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది.
కన్నప్ప పేరుతో మంచు విష్ణు హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా రీసెంట్‌గా శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు.అయితే అలా డిజప్పాయింట్ అయిన వారందరికీ మంచు విష్ణు తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పారు.రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఇందులో ఓ కీ రోల్ చేయబోతున్నారు.
ప్రభాస్ కీ రోల్‌కు సంబంధించి మంచు విష్ణు కూడా కన్ఫర్మ్ చేశారు.ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతున్న ఈ వార్తను మంచు విష్ణు హరహర మహాదేవ్ అంటూ కన్నప్ప హ్యాప్‌ట్యాగ్‌తో క్లారిటీ ఇచ్చేశారు.
దీంతో ఒక్కసారిగా కన్నప్ప ట్యాగ్ ట్రెండ్‌లోకి వచ్చేసింది.ప్రభాస్ ఇందులో చేస్తున్నాడని తెలియగానే ఈ సినిమా స్వరూపమే మారిపోయింది.
మంచు ఫ్యామిలీ హీరోలకు చాలా కాలం నుంచి సరైన సినిమా పడటం లేదు.ఇప్పుడు కన్నప్ప సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే ప్రభాస్ పేరుతో పక్కా బ్లాక్‌బస్టర్ అనేలా టాక్ మొదలైంది.ఎందుకంటే.కన్నప్పకి ఉన్న కనెక్షన్ అలాంటిది మరి.నిజంగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి మరి.కాగా ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో నిర్మించడానికి మంచు విష్ణు సన్నాహాలు చేస్తున్నారు.తన తండ్రి మోహన్ బాబు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తుండగా స్టార్ ప్లస్‌లో మహాభారత్ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు.కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు సరసన హీరోయిన్‌గా నటించనుంది.