అదే నిజం అయితే ప్రభాస్‌ 'కల్కి' ఇప్పట్లో రానట్లే..!

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్( Prabhas ) హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వం లో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా( Kalki 2898 AD movie ) షూటింగ్‌ ఆ మధ్యే పూర్తి అయినట్లుగా చెప్పారు.2024 సంక్రాంతికి నూటికి నూరు శాతం వస్తుందని అంతా కూడా పేర్కొన్నారు.కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం కచ్చితంగా సినిమా వచ్చే ఏడాది చివరి వరకు కూడా వచ్చేది అనుమానమే అన్నట్లుగా ఉంది.ఈ మధ్య కాలంలో నాగ్‌ అశ్విన్‌( Nag Ashwin ) మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టాడు అంటున్నారు.

 Prabhas Kalki 2898 Ad Movie Release Update , Kalki 2898 Ad Movie, Prabhas, Nag A-TeluguStop.com

అంటే సినిమాకు సంబంధించిన దాదాపు 20 శాతం షూటింగ్‌ ను మళ్లీ చేయాల్సి వస్తుందట.అదే కనుక నిజం అయితే సినిమా ను 2024 లో విడుదల చేయడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.

అయితే అమితాబ్ నుంచి దీపిక వరకు ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా కు సంబంధించిన 20 శాతం సన్నివేశాలు రీ షూట్‌ చేయాలి అంటే వారు ఒప్పుకోవాలి, అంతే కాకుండా వారు డేట్లు ఇచ్చేందుకు మళ్లీ భారీ పారితోషికం సమర్పించుకోవాల్సి ఉంటుంది.

Telugu Kalki Ad, Nag Ashwin, Prabhas Kalki-Movie

కనుక అంతటి సాహసం ఎవరు చేయరు.అయిన దర్శకుడు నాగ్‌ అశ్విన్ రీ షూట్స్ కు వెళ్లే రకం కానే కాదు.తాను అనుకున్నది ముందే రెడీ చేసుకుంటాడు.

కనుక ఆయన నుంచి వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అయ్యి ఉంటాయి.కనుక ఈ విషయం లో ఇతరులు ఎక్కువగా రియాక్ట్‌ అవ్వాల్సిన పని లేదు అన్నట్లుగా ప్రభాస్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఆలస్యం అవుతున్న కారణంగానే సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా వేశారు.అంతే తప్ప షూటింగ్‌ లేనే లేదు.

షూటింగ్ లో ప్రభాస్ ఇప్పటికే పాల్గొన్నాడు.కనుక ప్రాజెక్ట్‌ కే సినిమా( Project K movie ) విడుదల విషయం లో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube