జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథనిలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఈ మేరకు కాటారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు వ్యతిరేకంగా కొందరు నేతలు సమావేశం అవుతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే పుట్ట మధుకు టికెట్ ఇవ్వొద్దంటూ వ్యతిరేక వర్గీయులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కాటారంలో మధు వ్యతిరేక వర్గీయులతో కాటారం సింగిల్ విండో ఛైర్మన్ చల్లా నారాయణ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారని సమాచారం.
దీంతో మంథని రాజకీయాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.