దక్షిణ భారతదేశానికి చెందిన ప్రజలు ప్రధానంగా బియ్యంతో వండిన అన్నాన్ని తినడానికే ప్రాధాన్యతనిస్తున్నారు.బియ్యాన్ని సంపూర్ణ ఆహారంగా ప్రజలు భావిస్తారు కాబట్టే మన దేశంలో వీటి వినియోగం ఎక్కువ.
అయితే ఒకప్పుడు ప్రజలు దంపుడు బియ్యం ఎక్కువగా తినేవారు.అయితే మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారాయి.
ప్రస్తుతం ప్రజలు పాలిష్ పట్టిన తెల్ల బియ్యాన్ని ఎక్కువగా తింటున్నారు.
తెల్ల బియ్యం రుచిగా ఉండటం వల్లే దీనిని తినడానికి ప్రజలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.
అయితే వైద్య నిపుణులు మాత్రం పాలిష్ పట్టిన బియ్యం కంటే పాలిష్ పట్టని బియ్యం తింటేనే మంచిదని చెబుతున్నారు.పాలిష్ పట్టని బియ్యంలో మాత్రమే మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని తెలుపుతున్నారు.పాలిష్ చేయని ముడి బియ్యం పాలిష్ చేసిన తెల్ల బియ్యం మధ్య తేడాలను పరిశీలిస్తే ముడి బియ్యంలో 1.8 గ్రాముల ఫైబర్ లభించగా తెల్ల బియ్యంలో 0.4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.
తెల్ల బియ్యం ఎక్కువగా తీసుకునేవారిలో పోషకాహార లోపాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ముడి బియ్యం ఎక్కువగా తీసుకుంటే అందులో ఉండే యాంటీ న్యూట్రియెంట్లు పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని, ఆర్సెనిక్ వల్ల మధుమేహం, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు.
ముడి బియ్యం తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రజలు ముడి బియ్యమే ఎక్కువగా తీసుకోవాలని… అయితే మితంగా తీసుకోవాలని ఎత్తుకు కావాల్సిన బరువు ఉండాలనుకునే వారు ముడిబియ్యానికి ప్రాధాన్యతనివ్వడం మంచిదని తెలుపుతున్నారు.