ఇంటికి వెళ్లాలని 1000 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లారు... కానీ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న కలకలం కారణంగా అత్యవసర లాక్ డౌన్ విధించడంతో రవాణా వ్యవస్థను ఎక్కడికక్కడే స్తంభింప చేసిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో తాజాగా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు దంపతులు తమ స్వగ్రామానికి వెళ్లేందుకు గాను దాదాపుగా 1000 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేసి చివరికి ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులకు చిక్కిన ఘటన రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లాలో చోటు చేసుకుంది.

 Odisha News, Police, Couples In Corona Quarantine, Corona Virus News-TeluguStop.com

వివరాల్లోకి వెళితే ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు దంపతులు బతుకు దెరువు నిమిత్తమై తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి కొంతకాలం క్రిందట వచ్చారు.ఈ క్రమంలో నగరంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

కాగా గత కొద్దికాలంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కుంటున్నారు.దీంతో తమ స్వగ్రామానికి వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే ప్రస్తుతం ఎటువంటి ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో దంపతులిద్దరూ కలిసి సైకిల్ మీదే వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఇందులో భాగంగా సైకిల్ మీద బయలుదేరి దాదాపుగా 1000 కిలోమీటర్లు ప్రయాణం చేశారు.

క్షేమంగా తమ స్వగ్రామానికి మరికొద్ది గంటల్లో చేరుకోవచ్చనే సమయంలో ఈ దంపతులకి ఊహించని షాక్ తగిలింది.ఒడిస్సా రాష్ట్ర సరిహద్దు అయినటువంటి మల్కన్గిరి ప్రాంతంలో పోలీసులు ఈ దంపతులను గుర్తించారు.

ఇందులో భాగంగా దంపతుల వివరాలను తెలుసుకొని ఇద్దరిని 14 రోజులపాటు క్వారెంటైన్ లో ఉండాలని సూచించి దగ్గరలో ఉన్నటువంటి క్వారెంటైన్ భవనానికి తరలించారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరికొందరయితే మాత్రం ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికయితే ప్రత్యేక విమానాలు పంపించి మరి స్వదేశాలకు తీసుకువస్తున్నారని, కానీ స్వదేశంలో ఉండి తమ స్వగ్రామాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారిని మాత్రం గాలికి వదిలేశారని ప్రభుత్వ తీరుపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube