సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో మహేష్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.
ఇప్పటికే వంశీ పైడిపల్లి సినిమాను కాదని గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ క్రమంలోనే మహేష్ బాబుతో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని దర్శకధీరుడు రాజమౌళి అనౌన్స్ చేయడంతో చిత్ర వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక రాజమౌళి సినిమా ప్రకటనతో మహేష్ కూడా తన ప్లాన్‌ను మార్చేందుకు సిద్ధమయ్యాడు.జక్కన్నతో సినిమాకంటే ముందే మరో రెండు సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నాడు మహేష్.
ఈ క్రమంలోనే పరశురామ్‌తో సినిమాతో పాటుగా మరో సినిమా కూడా చేయాలని ఫిక్స్ అయ్యాడట.
దీని కోసం కథలను వినే పనిలో పడ్డాడట మహేష్.
రాజమౌళి సినిమా కంటే కూడా ముందే రెండు సినిమాలు చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడట.ఆ తరువాత జక్కన్న సినిమాకు రెండేళ్ల సమయమైనా పడుతుందని మహేష్ భావిస్తున్నాడు.