హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియాకు పోలీసులు చెక్ పెడుతున్నారు.అమ్మ ఫౌండేషన్ పేరుతో చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చిన్నారులతో బెగ్గింగ్ చేయిస్తున్నట్లు గుర్తించారు.ఈ క్రమంలో పది మంది గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం నిందితుల నుంచి రూ.లక్షకు పైగా స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా రూ.కోటి పైగా స్థిరాస్తి పత్రాలను సీజ్ చేశారు.ఇప్పటికే నకిలీ ట్రాన్స్ జెండర్స్ తో పాటు వృద్ధులతో బెగ్గింగ్ చేయిస్తున్న నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.