జగిత్యాల కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ.. 48 గంటల్లోనే చేదించిన పోలీసులు..!

జగిత్యాల కొండగట్టు అంజన్న ఆలయంలో నగల చోరీ ని, జగిత్యాల పోలీసులు 48 గంటల్లోనే నిందితులను పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు.ఆలయంలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కర్ణాటక లోని బీదర్ లో దొంగల ముఠా లోని ముగ్గురు నిందితులను పట్టుకొని వారి వద్ద సుమారుగా 8 కిలోల వరకు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

 Police Arrest Kondagattu Anjanna Temple Thieves Details, Temple,gold, Police,, P-TeluguStop.com

జగిత్యాల పోలీసులు పది బృందాలుగా ఏర్పడి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపడుతూ, కర్ణాటకలో నిందితులు ఉన్నారన్న పక్క సమాచారంతో నిందితులను పట్టుకున్నారు.

Telugu Beedar, Dsp Prakash, Karnataka-General-Telugu

దొంగల ముఠాకు సంబంధించిన నిందితులు అందరూ బీదర్ కు చెందిన వాళ్లే.నిందితులు తిరిగే అడ్డాలపై నిఘా పెట్టి సోదాలు జరిపి, నలుగురు పోలీసులు ఒక టీం లాగా ఏర్పడి బీదర్ పరిసర ప్రాంతాల్లో గాలించి సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న ఒక నిందితుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.నిందితులు ఫోన్ వినియోగిస్తే దాని ఆధారంగా పట్టుబడతామని ఫోన్లను కూడా స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకొని తిరుగుతున్న క్రమంలో, పోలీసులు నిందితులు రహస్యంగా తిరిగే అడ్డాలను గుర్తించి ముఠాలోని ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.

మరో ఇద్దరు వ్యక్తుల కోసం నిఘా పెంచారు.

Telugu Beedar, Dsp Prakash, Karnataka-General-Telugu

అయితే నిందితులు దొంగిలించిన నగలు అన్ని రికవరీ కాలేదని, సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన వారిలో ఇద్దరు నిందితులు దొరకాల్సి ఉందని, కర్ణాటకలోని బీదర్ లో నిఘాను పెంచి ఆ ముగ్గురు నిందితులను పట్టుకున్నాక పూర్తి సమాచారాన్ని మీడియా ద్వారా తెలియజేస్తానని జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ తెలిపారు.48 గంటల్లోనే 90 శాతం కేసును చేదించిన టీమ్ ను అభినందిస్తూ, మొత్తం నగలు రికవరీ చేశాక ఐదు మంది దొంగల ముఠా నిందితులను కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube