ఏపీలోని ప్రైవేట్ కాలేజీల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.ఉన్నత విద్య రెగ్యులేషన్ యాక్ట్ 19/2019ను కాలేజీల సంఘం న్యాయస్థానంలో సవాల్ చేసింది.
చట్టానికి ఎలాంటి రాజ్యాంగ బద్ధత ఉందో తెలపాలని, ప్రాసెసింగ్ ఫీజుకు చట్టబద్ధత లేదంటూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ మేరకు రెగ్యులేటరీ కమిషన్ కౌంటర్ దాఖలు చేసింది.
అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.