చాలామంది స్టార్ హీరోలు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత అభిమానులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు.అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఛాన్స్ ఉన్న ప్రతి సందర్బంలో కూడా అభిమానులపై తన మనస్సులో ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.
అమెరికాలో అభిమానులతో ముచ్చటించిన తారక్ అభిమానుల రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేనని కామెంట్ చేశారు.
ఫ్యాన్స్ నాపై చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మరవలేనని ఎన్టీఆర్ అన్నారు.
మళ్లీ జన్మ ఉంటే ఫ్యాన్స్ అభిమానాన్ని పొందడానికి ఇలాగే పుట్టాలని కోరుకుంటున్నానని తారక్ అన్నారు.అభిమానులకు ఏమిచ్చినా రుణం తీరదని ఫ్యాన్స్ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని తారక్ చెప్పుకొచ్చారు.
అభిమానులు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారక్ మాకు బ్రదర్ లాంటి వ్యక్తి అని అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడని అమెరికాలో పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ప్రస్తుతం ఇతర భాషల ప్రేక్షకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతున్నారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఫ్యాన్స్ ను సంతోషానికి గురి చేశాయి.
ఫ్యాన్స్ సైతం వచ్చే జన్మలో కూడా నందమూరి ఫ్యామిలీకి అభిమానులుగా పుట్టాలని చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుండగా ఈ ప్రాజెక్ట్ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన సన్నివేశాలతో తెరకెక్కుతోంది.అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఫ్యాన్స్ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.







