ప్రిన్స్, అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం పెళ్లికూతురు పార్టీ.ఎ.
వి.ఆర్.స్వామి నిర్మించారు.అపర్ణ దర్శకత్వం వహించారు.
లేడీ సెంట్రిక్ మూవీగా రూపొందింది.అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం విడుదలతేదీని వెల్లడించేందుకు సోమవారం నాడు ఫిలింఛాంబర్ లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
నిర్మాత ఎ.వి.ఆర్.స్వామి మాట్లాడుతూ, రెండేళ్ళనాడు ఈ సినిమాను చిత్రీకరించాం.కరోనావల్ల విడుదల ఆలస్యమైంది.ప్రధానంగా కామెడీ బేస్ మూవీ.దర్శకురాలు అపర్ణ చాలా ఇంట్రెస్ట్ తో సినిమాను రూపొందించారు.పిల్లలతోపాటు పెద్దలు కూడా కలిసి చూడతగ్గ సినిమా.
మే 20న సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపారు.
దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తం గా మా సినిమా మే 20న విడుదలవుతుంది.
యు.ఎస్.లోకూడా రిలీజ్ అవుతుంది.అన్ని వయస్సులవారికి నచ్చే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలనని అన్నారు.
నటి అనీషా మాట్లాడుతూ, ఈరోజు కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాం.విడుదలతేదీ ప్రకటించడంతో చెప్పలేని ఆనందంగా వుంది.టీమ్ అంతా ప్రేమతో సినిమా చేశాం.మాలాంటి కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ థియేటర్లలోనే సినిమా చూడాలని కోరుకుంటున్నాం.
ఎంటర్టైన్మెంట్ మూవీగా రూపొందిన ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడతగ్గ మూవీ.నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ కొలాబరేషన్ తో విడుదల చేయడం ఆనందంగా వుందని తెలిపారు.
ప్రిన్స్ మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ విడుదలయి ఆరునెలలు అయింది.శ్రీకర్ అగస్తీ ఇచ్చిన ఆడియో బాగా పాపులర్ అయింది.సినిమాకూడా కొత్తగా వుండబోతుంది.శరత్మరార్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అపర్ణగారికి, నిర్మాత స్వామిగారికి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నానని తెలిపారు.
అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ, మమ్మల్ని ప్రోత్సహించిన అన్నపూర్ణమ్మగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.
మా అందరి నీ ప్రతిభ చూసి ఎంపిక చేశారు.కోవిడ్ వల్ల సినిమా ఆలస్యమైంది.
ఇప్పుడు మే20న విడుదలకాబోతుంది.ఈ సందర్భంగా నార్త్స్టార్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.
నారాయణ కెమెరా, శ్రీకర్ అగస్తీ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.
సాయికీర్తన్ మాట్లాడుతూ, నా పాత్ర చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది.
ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేశాను.అందుకు చాలా హ్యాపీగా వుంది అన్నారు.
యూట్యూబ్ లో ఫేమస్ అయిన జయత్రీ మాట్లాడుతూ, మేము నటించిన పెళ్లికూతురు పార్టీ సినిమా చాలా సరదాగా వుంటుంది.మే 20న విడులకాబోతున్నందుకు చాలా సంతోషంగా వుందని తెలిపారు.
సీత (యూట్యూబ్), ఫణి మాట్లాడుతూ, ఇది పూర్తి వినోదాత్మకంగా వుండే సినిమా.అందరూ థియేటర్ కు వచ్చి చూసి ఆనందించడండి అని తెలిపారు.