Pawan Kalyan : ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోండి… పవన్ సినిమా కోసం అప్పటి దాకా వెయిట్ చేయాల్సిందే !

పవన్ కళ్యాణ్.( Pawan Kalyan )అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఓవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను నడిపిస్తున్నాడు.

 Pawna Kalyan Movie Shooting Updates-TeluguStop.com

రాజకీయాలను నడిపించాలంటే పార్టీ కోసం చాలా డబ్బులు అవసరం కాబట్టే సినిమాలో తీస్తున్నాను అనే స్టేట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చేసాడు తనకు సంబంధించిన అంతవరకు సినిమా కేవలం డబ్బు కోసమే ఆ డబ్బు రాజకీయం కోసమే.సరే కాసేపు రాజకీయాలను పక్కన పెడితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల విషయానికి వద్దాం.

పవన్ కళ్యాణ్ బ్రో సినిమా తర్వాత మరో చిత్రంలో ఇప్పట్లో కనిపించే అవకాశం లేకుండా పోయేలా ఉంది.పైగా అతని నటిస్తున్న సినిమాలన్నింటికీ డేట్స్ సమస్య మాత్రమే ఉంది.

సినిమాలన్నీ షూటింగ్ జరుపుకుంటున్న వాటికి డేట్స్ ఇవ్వలేని పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు.

Telugu Ap, Harihara, Harish Shankar, Og, Pawan Kalyan, Tollywood-Movie

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ) ఇది కొంతమేర షూటింగ్ జరుపుకుంది అయినా కూడా ఇంకా 30 రోజుల డేట్స్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం కేటాయించాల్సి ఉండగా అది ఇప్పట్లో జరిగే విధంగా లేదు.ఎందుకంటే ఆంధ్రాలో ఎలక్షన్స్( Ap Elections ) రాబోతున్నాయి.ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా సినిమాలపై ఫోకస్ పెట్టే పరిస్థితులు పవన్ కళ్యాణ్ కి లేవు.

దాంతో క్రిష్ 3 ఏళ్లుగా జరుగుతున్న ఈ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియక ఎదురు చూస్తూనే ఉన్నాడు.మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

Telugu Ap, Harihara, Harish Shankar, Og, Pawan Kalyan, Tollywood-Movie

ఈ సినిమా షూటింగ్ కూడా కొద్దీ మేర జరిగి పెండింగ్ లో ఉంది.దాంతో ఎప్పుడు డేట్స్ ఇస్తాడో తెలియక హరీష్ కూడా పవన్ కళ్యాణ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు.ఇక సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా OG అనే సినిమా( OM movie ) ప్రారంభమై మొదటి షెడ్యూల్ పూర్తయింది.మిగతా షెడ్యూల్స్ ఎప్పుడు పూర్తయితాయో అని సుజిత్ సైతం పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నాడు.

దాంతో 2024 దసరా వరకు పవన్ కళ్యాణ్ ఏ చిత్రం కూడా విడుదల అయ్యే పరిస్థితి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube