పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ.. ఎన్ని వందల కోట్లు తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు చెబితే చాలు ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి.

 Janasena Leader Powerstar Pawan Kalyan Properties Value, Pawan Kalyan,janasena P-TeluguStop.com

మిగితా హీరో లతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ చేసింది కొన్ని సినిమాలే.మిగతా హీరో లతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ కెరీర్లో విజయం సాధించింది కూడా కొన్ని సినిమాలు.

మిగతా హీరోలతో పోలిస్తే చూస్తే అటు పబ్లిక్ ఫిగర్ గా ఎప్పుడూ ప్రేక్షకుల మధ్య పవన్ కళ్యాణ్ వుండేది కూడా చాలా తక్కువే.కానీ ఇవన్నీ లేకపోయినా మిగతా హీరోలతో పోలిస్తే ఆయన అభిమానులు మాత్రం ఎక్కువే ఉన్నారు.

ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండే వీరాభిమానుల ఎక్కువ ఉన్నారు.


ఇక పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైంది అంటే థియేటర్ మొత్తం అభిమానుల అల్లరితో దద్దరిల్లిపోతోంది అని చెప్పాలి.

అయితే రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత మొన్నటికి మొన్న భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఒక వైపు రాజకీయాలను మరోవైపు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్.

ఇటీవలి కాలంలో సినిమాలకంటే కాస్త ఎన్నికల పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.


Telugu Bheemla Nayak, Janasenapawan, Janasena, Pawan Kalyan, Pawankalyan, Vakeel

కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.పవన్ కళ్యాణ్ తనకు 180 కోట్ల ఆస్తి ఉంది అంటూ ఇటీవల చెప్పుకొచ్చారు.స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు.

సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఒకటే విధంగా ఉంటుందని ఎంతో మంది సినీ ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు.కానీ ఇది నిజం కాదట.

సినిమా హిట్ అయితే లాభాల్లో షేర్ తీసుకుంటారట పవన్ కళ్యాణ్.అదే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే తాను తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేస్తారట.

పవన్ కళ్యాణ్ కు ఇంత మంచి మనసు ఉంది కాబట్టే ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు అందరూ కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అని చెప్పాలి.ఇక ఆయన సంపాదించిన మొత్తాన్ని కూడా జనసేన పార్టీని నడిపించేందుకు కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube