వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితి లోనూ వైసిపి( YCP ) ని గద్దె దించుతానని శబదం చేసిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తన వరుస వారాహి యాత్రలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు.ముఖ్యంగా ఉత్తరాంధ్ర వేదికగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి మరీ హైలెట్ చేస్తున్న తీరు నేషనల్ మీడియా అటెన్షన్ కూడా దక్కించుకుంటుంది .
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ నిన్నటి మొన్నటి వరకు మూడవ ఆల్టర్నేటివ్ గా ఉన్న జనసేన( Janasena ) ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదుగుతుందని వార్తలు వస్తున్నాయి .
అదికార వైసీపీ ని ఢీ కొట్టే శక్తి సామర్థ్యాలు జనసేనకు మాత్రమే ఉన్నాయని సామాన్య జనంలోనూ ఒక అభిప్రాయం వినిపించడం తెలుగుదేశం శ్రేణులను బాగా కలవర పడుతుందట .ముఖ్యంగా పొత్తు లో భాగంగా నామమాత్రం సీట్లతో జనసేనను పరిమితం చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party )ఇప్పుడు వారాహి దూకుడు ఇబ్బంది పడుతుందట.ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యా లపై పవన్ నిలదీస్తున్న తీరు కు సామాన్య ప్రజల నుంచి భారీ స్థాయిలో స్పందన కనిపిస్తుంది.
గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే ఏపీకి ఇలాంటి పరిస్థితి దాపురించిందని పవన్ లెక్కలతో విదానం తో ఇంతకుముందు అధికారం చలాయించిన టిడిపి( TDP )కి కూడా ఇందులో భాగం ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా పవన్( Pawan Kalyan ) నిలదీస్తున్న ప్రతి అంశము వైసిపి తోపాటు టిడిపికి కూడా తగులుతుండడంతో మూడవ ప్రత్యామ్నాయంగా జనసేన మాత్రమే ఉందన్న విషయాన్ని జనసేన హైలెట్ చేస్తుండడంతో టిడిపి ఇబ్బందులు పడుతుంది.
అంతేకాకుండా జనసేన వైపు ఆకర్షితం అవుతున్న వర్గాలలో ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల వర్గాలు కూడా ఉంటున్నాయని బీసీలు మహిళలు ఇప్పుడు పెద్ద సంఖ్య లో జనసేన వైపు చూస్తున్నారన్న వార్తలు ఇప్పుడు తెలుగుదేశంలో కొత్త ఆలోచనలు మొదలైనట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా జనసేన దూకుడుకు కీలక నాయకులు కూడా ఆకర్షితమై ఆయా ప్రాంతాల్లో సీటుపై హామీ తెచ్చుకుంటే రేపు పొత్తుల్లో చర్చల్లో భాగంగా ఈ విషయాలు పెద్ద పీఠముడి గా మారిపోతాయేమోనని ఆందోళన తెలుగుదేశం లో కలుగుతున్నట్లుగా తెలుస్తుంది.మరి రాజకీయంగా జనసేన ఎదుగుదల టిడిపి పతనానికి ప్రారంభ సూచక అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.