అధికార భాజాపా( BJP PARTY )కు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇండియాకు ఆదిలోనే బాలారిష్టాలు ఎదురవుతున్నాయి.ముఖ్యం గా భాగస్వామ్య పక్షాల మధ్యన విశ్వాసం లేకపోవడం ఈ కూటమికి ప్రధాన అడ్డంకి గా మారినట్లు తెలుస్తుంది.
ముఖ్యంగా చాలా రాష్ట్రాలలో ఈ భాగస్వామ్యపక్షాలు ప్రతిపక్ష పార్టీలుగా తలబడుతూ ఉండడంతో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రావడం లేదని తెలుస్తుంది .మరోపక్క మరాఠయోధుడు శరద్ పవార్( Sharad Pawar ) తన పార్టీని నిలువునా చీల్చిన తన మేనల్లుడు అజిత్ పవార్ తో సమావేశం అవడం ఢిల్లీ వేదికగా చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భాజపా అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లు ఉన్న మహారాష్ట్రను కీలకంగా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.దాంతో ఎన్సీపీను తన వైపుకు పూర్తిగా తిప్పుకుంటే మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకోవచ్చని భావిస్తున్న భాజాపా ఈ మరటా పోరాటయోధుడిని దువ్వుతున్నట్లుగా కనిపిస్తుంది.ముఖ్యంగా ఆయనకు వ్యవసాయ శాఖ ఆయన కుమార్తె సుప్రియ శూలేకు మరో కేంద్ర మంత్రి పదవి ఆశగా చూపి ఆయనను తమ వైపు తిప్పుకోవాలని రాయబారం పంపినట్లుగా ఢిల్లీలో చర్చ జరుగుతుంది.దీనిపై ప్రతిపక్ష శివసేన( Shiv Sena ) మండిపడుతుంది.
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి భేటీ ఆమోదయోగ్యం కాదని శివసేన ప్రకటించింది.మరొక ప్రక్క ఆప్ – కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతా ఆశాజనకంగా కనిపించడం లేదు ఢిల్లీలో పరిపాలన బాగాలేదని ఒక కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించడం వివాదానికి ఆజ్యం పోస్తుంది.

83 సంవత్సరాలు దాటిన తమ నేతను ఇండియా ప్రతిపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఎన్సీపీ నుంచి డిమాండ్లు వస్తున్నాయి.అయితే దీనికి ప్రతిపక్ష కూటమి అంత ఆసక్తి గా లేదు మరోపక్క బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్( Nitish Kumar ) ప్రధాని పదవిపై కన్నేశారు.ఇలా ప్రధాని పదవిపై ఆశావహుల లిస్టు పెరిగిపోతూ ఉంది.దీంతో ఇండియా కూటమికి ఆదిలోనే అవరోధాలు ఎదురవుతున్నాయి .మరి ఆ బాల రెస్టాలన్ని దాటుకొని ఎన్నికల క్షేత్రానికి ఇండియా కూటమి ఎలా సిద్ధమవుతుందో చూడాలి
.






