నాకు కొన్నేళ్ళ క్రిత్రమే తెలుసు..శ్రీవారి ఆభరణాల మాయంపై...పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వం పై మరోమారు విమర్సనాస్త్రాలు ఎక్కుపెట్టారు.గతకొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల పై ఆయన స్పందించారు.

రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలకి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఇదేనా.? మీ సంధానం ఏపీ ప్రజలకి సంతృప్తి కరంగా లేదు అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.ఎంతో సెంటిమెంట్ తో కూడుకున్న తిరుమల కొండపై జరుగుతున్న ఘోరాలకి మీరు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలుసునని అన్నారు.

ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించిన పవన్ కళ్యాణ్ మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఓ భక్తుడు కాయిన్స్ విసరడం వల్ల గులాబీరంగు వజ్రం ముక్కలు కావడంపై, అది మాయం కావడంపై ఫోరెన్సిక్ నిపుణులతో సీన్ రిక్రియేట్ చేయలేమా అని ప్రశ్నించారు.అప్పుడు వాస్తవం బయటకియా వస్తుంది కదా అని అన్నారు.

అంతేకాదు ఆభరణాల మాయం విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో గుబులు రేపుతున్నాయి.

కొన్నేళ్ల క్రితం హైదరాబాదు విమానాశ్రయంలో నన్ను కలిసిన ఓ వ్యక్తి టీటీడీ ఆభరణాల మాయంపై ఆసక్తికరమైన వాస్తవాలను తనకు చెప్పాడని, అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలకు కూడా ఆ విషయం తెలుసునని చెప్పాడని పవన్ కల్యాణ్ అన్నారు.

మనదేశం నుంచి ఓ ప్రైవేట్ విమానంలో టీటీడీ ఆభరణాలు మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లాయని అతను చెప్పినట్లు ఆయన తెలిపారు.అందుకే రమణ దీక్షితులు ఆరోపణలు నాకు పెద్ద వింతగా అనిపించలేదు అని అన్నారు.

అయితే తిరుమల తిరుపతి దేవుడు.బాలాజీ మౌనంగానే ఉంటాడు.అయితే స్వామి ఏమి చేయడు అనుకుంటారు కాని ఎదో ఒక రోజు ఈ నిజం బయటపడుతుందని.కేవలం నాణాలు తగిలి ఒక మేలిమి వజ్రం పగిలి పోతుంది అనడం హాస్యాస్పదం అని అయితే వజ్రం వజ్రానికే తెగుతుంది కదా మరి నాణాలకి ఎలా పగిలిందో టీడీపీ ప్రభుత్వం చెప్పాలని తెలిపారు.

అయితే, ఖజానాలో దాచిన ఆభరణాల సంగతేమిటని ఆయన ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube