శ్రీరెడ్డిలో కొత్త యాంగిల్‌, రానాపై..!

కొన్ని నెలల ముందు వరకు శ్రీరెడ్డి అంటే సినిమా ఇండస్ట్రీలో వారికి కూడా పెద్దగా తెలియదు.కాని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న వారితో పాటు, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారికి కూడా శ్రీరెడ్డి ఎవరు ఏంటీ అనే విషయం తెలిసింది.

 Sri Reddy New Angel Comments On Hero Rana-TeluguStop.com

జాతీయ మీడియాలో కూడా ఈమె గురించి వార్త కథనాలు రావడంతో పబ్లిక్‌ ఫిగర్‌ అయ్యింది.హీరోయిన్‌కు ఉన్న గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు సినిమాలు చేయకున్నా కూడా సోషల్‌ మీడియాతో తెగ పాపులర్‌ అవుతుంది.

మొన్నటి వరకు ప్రతి రోజు పది టీవీ ఛానెల్స్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడిపిన ఈమె ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా పంచ్‌ల వర్షం కురిపిస్తుంది.

మొన్నటి వరకు ప్రతి హీరోపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన శ్రీరెడ్డి తాజాగా తన గొంతును కాస్త సవరించుకున్నట్లుగా అనిపిస్తుంది.శ్రీరెడ్డి ఇటీవల నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.ఆయనపై ఏ ఆడది చేయని, చేయకూడని విమర్శలు చేసి సంచలనం సృష్టించింది.

నాని నాతో పడుకున్నాడు అని, నాతో దారుణంగా వ్యవహరించాడు అంటూ చెప్పుకొచ్చింది.తాజాగా ఆమె చేసిన ఆరోపణలు నాని కెరీర్‌ను కూడా ప్రభావం చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.

గత కొన్ని రోజులుగా నానిపై వ్యాఖ్యలను కాస్త తగ్గించింది.ఈమె చేసిన ఆరోపణలు మరియు విమర్శల విషయంలో నాని లీగల్‌గా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నాని లీగల్‌గా పోరాడేందుకు సిద్దం అవుతున్న సమయంలో శ్రీరెడ్డి కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది.

సినిమా పరిశ్రమ వారిపై కాస్త ఘాటు వ్యాఖ్యలను తగ్గించింది.ఆమద్య రానా తమ్ముడు అభిరామ్‌తో ఈమె జరిపిన సరస సల్లాపాలకు సంబంధించిన ఫొటోలు లీక్‌ అయిన విషయం తెల్సిందే.

ఆయనతో ఈమె చాలా క్లోజ్‌గా ఉన్నట్లుగా ఆ ఫొటోల్లో వెళ్లడి అయ్యింది.దాంతో సురేష్‌బాబు ఫ్యామిలీ పరువు పోయింది.

ఈ సమయంలోనే సురేష్‌బాబు మరో కొడుకు రానా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.

అభిరామ్‌పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి రానా విషయంలో మాత్రం పాజిటివ్‌గా రెస్పాన్స్‌ అయ్యి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

రానా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి బాధపడ్డాను.ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube