తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి పావలా శ్యామల( Pavala Shyamala ) ఒకరు.అయితే ప్రస్తుతం ఈమె వృద్ధాప్యం కారణంగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈమెకు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తాయనే విషయం అందరికీ తెలిసిందే.ఒకవైపు కూతురు అనారోగ్యంతో బాధపడుతూ మంచనా ఉండగా మరోవైపు ఈమెకు సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు( Pavala Shyamala Financial problems ) తనని వెంటాడుతున్న నేపథ్యంలో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక ఈమె ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలియడంతో ఎంతోమంది యూట్యూబర్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకొని తన కష్టాలను అందరికీ తెలియజేస్తున్నారు.
ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది( Hyper Aadi ) పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను వయసు పై పడటంతో సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాను కానీ నేను చనిపోలేదని బ్రతికే ఉన్నానని అనారోగ్యానికి మాత్రమే గురయ్యానని ఈమె తెలియజేశారు.కానీ కొంతమంది మాత్రం నేను చనిపోయాను అంటూ ప్రచారం చేస్తున్నారని ఈమె మండిపడ్డారు.
నేను చనిపోయానని మీడియా వాళ్ళు మాత్రమే కాకుండా జబర్దస్త్ కార్యక్రమంలో( Jabardasth ) సందడి చేసినటువంటి హైపర్ ఆది కూడా తాను చనిపోయాను అంటూ చెప్పడం తనని చాలా బాధ కలిగించిందని ఈమె తెలిపారు.
హైపర్ ఆది జబర్దస్త్ లో కొనసాగుతున్న సమయంలో చనిపోయిన వారి పక్కన నా ఫోటో కూడా పెట్టి నేను కూడా పోయాను అంటూ కామెంట్ చేశారు.అలా బ్రతికుండగానే నన్ను చంపేశాడు అంటూ ఈ సందర్భంగా ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.ఆ ఎపిసోడ్ చూసి నాకు చాలా బాధ కలిగింది అంటూ పావలా శ్యామల మండిపడ్డారు.
తాము అవకాశాలు లేక ఇండస్ట్రీ( Film Industry )కి దూరమైతే అందరూ చనిపోయారని వార్తలు రాస్తున్నారు.అయితే మేము ఇంకా బ్రతికే ఉన్నాము అని ఇలా ఇంటర్వ్యూల ద్వారా చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఈమె తెలిపారు.