అందరూ ఊహించినట్లే కాంగ్రెస్( Congress Party ) మలి జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపింది.ముఖ్యంగా టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు అధిష్టానం పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు .
కొంతమంది అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది రేవంత్ రెడ్డి( Revanth Reddy ) టార్గెట్ గా గాంధీభవన్ ఎదుట తీవ్ర నిరసనలకి తేర తీశారు .కొంతమంది రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తుండగా మరి కొంతమంది పార్టీ బలోపేతం కోసం తమ కాలాన్ని,ధనాన్ని ఖర్చు పెట్టామని , ఇప్పుడు పార్టీ మోసం చేసింది అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.మునుగోడు టికెట్ ఆశించి బంగపడిన చల్లమల్ల కృష్ణారెడ్డి( Challamalla Krishna Reddy ) అయితే నాయకులకు సలాం కొట్టే వాళ్లకు, గాంధీభవన్లో పైరవీలు చేసే వాళ్లకే టికెట్లు ఇస్తారని తెలియక ప్రజల మధ్య తిరిగానని,
రేవంత్ రెడ్డి వర్గం మనిషి అనే ముద్ర వేసి కుట్రతో టికెట్ రాకుండా చేశారని రెబెల్గా పోటీ చేస్తానని ప్రకటించారు.వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించి బంగపడిన రాఘవరెడ్డి( Raghava Reddy ) పార్టీ కోసం కోట్లు ఖర్చు చేశానని, కానీ భూ అక్రమలకు పాల్పడిన వారికి టికెట్లు ఇచ్చారంటూ వాపోయారు.జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రెడ్డి అయితే రెబల్ గానే దిగుతానని ప్రకటించారు.అలాగే నాగర్ కర్నూల్ టికెట్ దక్కని నాగం జనార్దన్ రెడ్డి( Nagam Janardhan Reddy ) కూడా అధిష్టానం వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే నరసాపూర్, పినపాక కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల అభ్యర్ధులు మరోసారి ఆలోచించుకోమంటూ అధిష్టానానికి డెడ్లైన్లు పెడుతున్నారు.
అలాగే కొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు.కూకట్పల్లి టికెట్ ఆశించిన పిసిసి సభ్యుడు గొట్టుముక్కల వెంగళరావు పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు, అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి మురుసుకోల సరస్వతి, మైనారిటీ విభాగం చైర్మెన్ షేక్ అబ్దుల్లా కూడా రాజీనామాల పర్వానికి తెర తీశారు.మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మద్దతు దారులు గాంధీభవన్ ( Gandhi Bhavan ) వద్ద నిరసన చేపట్టి పార్టీ జెండాకు నిప్పు పెట్టారు.
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అయితే మరో రెండు మూడు రోజుల్లో మరిన్ని రాజీనామాలు కాంగ్రెస్ నుంచి ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక టికెట్ ఆశిస్తున్న చాలా మంది నేతలకు ఇక చివరి ఆప్షన్ గా భాజపా మిగిలింది .