వందే భారత్‌లో వరస్ట్ ఫుడ్ సర్వ్ చేశారంటూ ప్యాసింజర్ ఫైర్.. వీడియో వైరల్..

ఇండియన్ ట్రైన్‌లో సర్వ్ చేసే ఫుడ్ క్వాలిటీ వరస్ట్‌గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చాలామంది ప్రయాణికులు ఇప్పటికే ఈ ఫుడ్ దారుణంగా ఉందని సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు.

 Passenger Claims Dirty Food Served On Vande Bharat Express Video Viral Details,-TeluguStop.com

ఆహారంలో బొద్దింకల వంటి పురుగులు వస్తున్నాయని, ఆహారాన్ని ఎలుకలు ఎంగిలి చేస్తున్నాయని మరికొంతమంది నాణ్యతా లోపాలను బహిర్గతం చేశారు.తాజాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్( Vande Bharat Express ) ట్రైన్‌లో కూడా ఇలాంటి చెత్త ఫుడ్ పెడుతున్నారని కొంతమంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారం కుళ్ళిపోవడంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ చేదు అనుభవం ఎవరికీ ఎదురు కాకూడదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆకాష్ కేశరి( Akash Keshari ) అనే ప్రయాణికుడు రైలులో నాణ్యత లేని ఆహారం గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌లో ఫిర్యాదు చేశాడు.అతను భారతీయ రైల్వే, రైల్వే మంత్రి, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అధికారిక ఖాతాలను ట్యాగ్ చేశాడు.

తన డబ్బును కూడా వాపసు అడిగాడు.అతను ఆహారం( Food ) బాగా లేదని ఆరోపణలు చేస్తూ తన మాటలకు రుజువుగా రెండు వీడియోలను షేర్ చేశాడు.

ఆహారం తినలేనంత చెత్తగా ఉన్నాయని వీడియోలు చూస్తూ ఉంటే అర్థమవుతోంది.ప్రయాణికులు( Passengers ) ఆహారాన్ని తినడానికి నిరాకరించి, దానిని వెనక్కి తీసుకోవాలని రైల్వే సిబ్బందిని కోరారు.కూరగాయల కూర( Vegetable Curry ) దుర్వాసన వస్తోందని, పప్పు పులుసు చెడిపోయిందని ఓ ప్రయాణికుడు తెలిపారు.ఎక్స్‌లో రైల్వే సర్వీస్ ఈ ఫిర్యాదుపై స్పందించింది.రైల్వే ఫిర్యాదుల పోర్టల్ అయిన రైల్‌మదాద్‌లో( Rail Madad ) ఫిర్యాదును నమోదు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.ప్రయాణీకుల మొబైల్ నంబర్‌కు ఫిర్యాదు నంబర్‌ను కూడా పంపించినట్లు తెలిపారు.

ఫిర్యాదు స్టేటస్ ట్రాక్ చేయడానికి ఓ లింక్ కూడా ఇచ్చారు.

ఈ ఘటనపై పలువురు యూజర్లు ఆగ్రహం, నిరాశను వ్యక్తం చేశారు.ఆహారం సరఫరా చేసిన విక్రయదారులను శిక్షించి తొలగించాలని అన్నారు.ఇలాంటి వ్యక్తులు భారతదేశపు ఫ్లాగ్‌షిప్ రైలు అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రతిష్టను మంటగలుపుతున్నారని అన్నారు.

రాజధాని తదితర రైళ్లలో కూడా ఇదే సమస్య ఉందని చెప్పారు.రైళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, సరిగా శుభ్రం చేయడం లేదని వాపోయారు.రైల్వేలు తమ పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచాలని వారు అన్నారు.ఈ విషయంపై దర్యాప్తు చేసి చర్య తీసుకోవాలని రైల్వేకు చెందిన క్యాటరింగ్, టూరిజం విభాగం IRCTCని ఒక వినియోగదారు కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube