చాక్లెట్స్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్.. అందుకు ఓ ప్లాన్

చిన్న పిల్లలు బాగా చార్లెట్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు.ఈ మధ్య కాలంలో మహిళాలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

 One Of The Best Options For Buying Chocolates Is To Plan Chocolate, India, Bang-TeluguStop.com

అసలు ఆ చాక్లెట్ లు ఎందుకు అంతా తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.రుచికరమైన డార్క్ చాక్లెట్లకు బ్రెజిల్ పెట్టింది పేరు.ప్రపంచంలో అత్యంత కాస్ట్‌లీ చాక్లెట్లు అక్కడ తయారుచేస్తారు.ఐతే… ఇండియాలో కూడా ఇప్పుడు ఎంతో టేస్టీ డార్క్ చాక్లెట్స్ లభిస్తున్నాయి.ప్రపంచంలోని ప్రముఖ చాక్లెట్ కంపెనీలన్నీ ఇండియాలో దేశీ టేస్టులకు తగినట్లుగా చాక్లెట్స్ తయారుచేస్తున్నాయి.అందువల్ల ఇవి భారతీయులకే కాదు.విదేశీయులకీ నచ్చుతున్నాయి.మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో కూడా డార్క్ చాక్లెట్లు ఉన్నా… ఇండియాలో తయారుచేసేవి ఓ కుర్రాడికి బాగా నచ్చేశాయి.

వాటిని తినాలనే కోరిక రోజురోజుకూ పెరిగిపోయింది.అవి బంగ్లాదేశ్‌లో లభించట్లేదు.

మరి ఏం చెయ్యాలి అని ఆలోచించాడు.అదే కరెక్ట్ అనుకున్నాడు ఆ విలేజ్ కుర్రాడు.

భారత్ రావాలంటే… బంగ్లాదేశ్‌లో విమానం ఎక్కి ఇండియాలో ల్యాండ్ అవ్వొచ్చు.ఇందుకు వీసా ఇతరత్రా ఫార్మాలిటీస్ ఉంటాయి.

ఆ కుర్రాడు ఇదంతా వీలయ్యే పని కాదు అనుకున్నాడు.దాని బదులు రహస్యంగా ఇండియాలోకి ప్రవేశించి చాక్లెట్స్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అనుకున్నాడు.

అందుకు ఓ ప్లాన్ వేసుకున్నాడు.

ఇమాన్ హొస్సేన్ రెండు దేశాల మధ్య ఉన్న షాల్దా నది దగ్గరకు వచ్చాడు.

ఆ నదే సరిహద్దు.ఆ నదిని చూసి అతను భయపడలేదు.ఎందుకంటే… తను రెగ్యులర్‌గా ఆ నదిలో దిగి ఈత కొడుతూ ఉంటాడు.నదిలో దిగిన కుర్రాడు ఈదుకుంటూ… ఇండియాలోని త్రిపురలో ఉన్న సిపాహిజాలా జిల్లాకి చేరాడు.

తీరా అక్కడికి వచ్చాక చూస్తే… ఇనుప కంచె ఉంది.దానికి ఓ చోట కన్నం పెట్టాడు.

తద్వారా కంచె దాటి ఇండియాలోని కలంచౌరా గ్రామానికి వచ్చాడు.అక్కడ తనకు నచ్చే భారత డార్క్ చాక్లెట్లు కొనుక్కున్నాడు.

తిరిగి ఆ నది దాటి బంగ్లాదేశ్ వెళ్లిపోయాడు.ఇలా ఒకసారి కాదు… తరచూ చేస్తున్నాడు.

Telugu Bangadesh, Security, Bsf Jawans, Chocolate, Comilla, Iman Hossain, India,

ఏప్రిల్ 13న కూడా ఇలాగే చేస్తుండగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు చూశారు.పట్టుకున్నారు.వదలేయమన్నాడు.చాక్లెట్ల కోసమే వచ్చానన్నాడు.కుదరదన్న జవాన్లు స్థానిక పోలీసులకు అప్పగించారు.వాళ్లు కోర్టుకు తీసుకెళ్లగా కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఆ కుర్రాడు… బంగ్లాదేశ్‌లోని కోమిల్లా జిల్లాకు చెందిన వాడని తెలిసింది.అతని దగ్గర కేవలం 100 బంగ్లాదేశీ టాకాలున్నాయి.

అతనిపై జాలి చూపిన అధికారులు ఎలాంటి తీవ్రమైన కేసులూ పెట్టలేదు.జస్ట్.

డాక్యుమెంట్స్ లేకుండా భారత్‌లో ప్రవేశించాడనే కేసు మాత్రమే పెట్టారు.ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు.

దర్యాప్తు పూర్తయ్యాక బంగ్లాదేశ్‌కి అప్పగిస్తామంటున్నారు.అటువైపు నుంచి కుర్రాడి తల్లిదండ్రులు ఇంకా స్పందించలేదట.

ఇలా చాలా మంది బంగ్లాదేశీయులు తరచూ సరిహద్దు దాటి భారత్‌లోకి వస్తున్నారు.ఇండియాలో వంటింటి సామాన్లు కొనుక్కుంటున్నారు.

భారత్‌లో జరిగే వేడుకల్లోనూ పాల్గొంటున్నారు.BSF జవాన్లు వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.

సైనికుల ఫోకస్ మొత్తం స్మగ్లర్లు, మనుషుల్ని ఎత్తుకుపోయే వారిపైనే ఉంది.మొత్తానికి ఇలా చాక్లెట్ల కోసం సరిహద్దు దాటాడనే వార్త వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube