సలార్ ట్రైలర్.. ఓజి గ్లింప్స్.. నెట్టింట ఇదే హవా.. మామూలు హైప్ లేదుగా!

ప్రజెంట్ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ వారి సినిమాల నుండి రాబోతున్న అప్డేట్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మన టాలీవుడ్ లో రాబోతున్న రెండు బిగ్గెస్ట్ సినిమాల్లో పాన్ ఇండియన్ స్టార్ నటిస్తున్న సలార్ ఒకటి కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటిస్తున్న ఓజి ( OG Movie )ఒకటి.

 Og And Salaar Treat Hyped To The Next Level, Director Sujeeth, Og Movie, Pawa-TeluguStop.com

చాలా రోజుల తర్వాత వారి స్టామినాకు తగిన సినిమాలతో వీరు రాబోతున్నారు.

అందుకే ఈ సినిమాలపై భారీ హైప్ నెలకొంది.ముందు నుండి ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాల నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు చేర్చాయి.

దీంతో ఈ రెండు సినిమాల విషయంలో ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు.ఇక ఈ రెండు సినిమాలపై హైప్ కూడా ఒక్కసారిగా పెరిగింది.

ఇప్పుడు ఈ రెండు సినిమాలు నుండి కూడా జస్ట్ కొన్ని రోజుల్లో వీడియో ట్రీట్ తో సందడి చేయనున్న నేపథ్యంలో సోషల్ మీడియా( Social media ) వేదికగా ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.ఒక పక్క సలార్( Salaar ) ట్రైలర్ రాబోతుంటే మరోపక్క ఓజి ఫస్ట్ గ్లింప్స్ కూడా రానుంది.దీంతో ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంత హైప్ ఈ రెండు వీడియోలపై పెరిగింది..సోషల్ మీడియాలో హవా మొత్తం ఈ చిత్రాల కోసమే నడుస్తుంది అనిపిస్తుంది.మరి ఈ అప్డేట్స్ వచ్చాక ఫ్యాన్స్ భూమి మీద నిలబడతారో లేదంటే ఆకాశంలో తేలుతారో చూడాలి.

ఇక ఓజి సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.అలాగే సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ ( Prashanth Neel )డైరెక్ట్ చేస్తుండగా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube