‘NTR31’ అప్డేట్.. సలార్ 2, వార్ 2 తర్వాతనే అట.. ఇప్పట్లో లేనట్టేనా?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న క్రమంలో ఈయన భారీ లైనప్ ను కూడా సెట్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు.ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా( Devara ) చేస్తున్నాడు.

 Ntr Prasanth Neel Ntr31 After Salaar And War 2 Completes-TeluguStop.com

జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో ఈయన తన నెక్స్ట్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే.అందుకే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి కొత్త రూమర్ తెరపైకి వచ్చింది.

తారక్, ప్రశాంత్ నీల్ సినిమా 2024లో స్టార్ట్ కావాల్సి ఉండగా ఇప్పుడు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.అందుకే ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2( Salaar 2 ) సినిమా మీదనే ద్రుష్టి పెడతారట.ఎన్టీఆర్ నీల్ కంటే ముందు ఆయన బాలీవుడ్ ప్రోజెక్ట్ వార్ 2( War 2 ) కోసం డేట్స్ కేటాయించనున్నాడు అని అందుకే ఈ లోపు నీల్ సలార్ 2 పూర్తి చేయనున్నాడు అని సమాచారం.

కాగా ఎన్టీఆర్ అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్( Hritik Roshan ) కాంబోలో ”వార్ 2” ప్రకటించారు.ఊహించని ఈ కాంబో ప్రకటించడమే సెన్సేషనల్ అయ్యింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ డిసెంబర్ లో స్టార్ట్ అవ్వనుందట.నవంబర్ నాటికీ ఈయన కొరటాల శివ సినిమాను పూర్తి చేసుకుని డిసెంబర్ నుండి వార్ 2 సెట్స్ లో జాయిన్ అవ్వనున్నారట.

ఇది పూర్తి అయ్యాకనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.చూడాలి ఏం జరుగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube