NTR: ఎన్టీఆర్ తెలివిగా తప్పించుకుంటే ఆ ఇద్దరు హీరోలకు షాక్ తగిలిందిగా.. మంచి పని చేశారంటూ?

తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కిక్, ఎవడు, రేసుగుర్రం, టెంపర్ వంటి హిట్ సినిమాలకు కథలు అందించి రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు వక్కంతం వంశీ.

2018 లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా( Naa Peru Surya Naa Illu India ) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.అయితే నిజానికి వంశీ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది.

దర్శకుడు వంశీకి అలాగే ఎన్టీఆర్ కి మంచి అనుబంధం కూడా ఉంది.ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి, టెంపర్ వంటి సినిమాలకు వక్కంతం రైటర్ గా పని చేశాడు.

ఆ అనుబంధంతోనే డైరెక్టర్ గా తన మొదటి సినిమాని ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడు వంశీ.ఎన్టీఆర్ కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు.కానీ వక్కంతం చెప్పిన కథతో పూర్తిగా సంతృప్తి చెందని తారక్ కొన్ని మార్పులు సూచించాడు.

Advertisement

ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వంశీ వెళ్ళి బన్నీకి( Bunny ) కథ చెప్పడం, నా పేరు సూర్య అనే చిత్రం పట్టాలెక్కడం జరిగిపోయాయి.అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

నా పేరు సూర్య ఫలితంతో వంశీకి దర్శకుడిగా రెండో సినిమా అవకాశం రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది.

ఎట్టకేలకు నితిన్ తో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్( Extra Ordinary Man ) చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు.ఇటీవల డిసెంబర్ 8న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు ఘోరమైన డిజాస్టర్ ను చవి చూసింది.అయితే ఈ కథ విషయంలో కూడా ఎన్టీఆర్ సంతృప్తి చెందకపోవడంతో ఈ సినిమా నితిన్ చేశారు.

అలా ఈ రెండు సినిమాల నుంచి ఎన్టీఆర్ తప్పించుకోవడంతో అల్లు అర్జున్ , నితిన్ హీరోలకు ఊహించని షాక్ తగిలి ఘోరమైన డిజాస్టర్లు సినిమాలను వారి ఖాతాలో వేసుకున్నారు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ ఆ సినిమాలు ఎన్టీఆర్ చేయకపోవడమే మంచిది అయింది అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు .

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు