మనోళ్ళు మాములోళ్ళు కాదురోయ్ అని మనం సహజంగా అనుకుంటాం అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలు ముక్త ఖంటంతో చెప్తున్నాయి భారత ఎన్నారైలు మాములోళ్ళు కాదని.ఎందుకంటే విదేశీ వీసాల నుంచీ విద్యా,ఉద్యోగాల వరకూ.
పోటీ తత్వంలో నెగ్గటం నుంచీ రాజకీయాలలో సాధిస్తున్న విజయాల వరకూ అన్ని రంగాలలలో విదేశాలలో భారతీయులు పాత్ర ఎంతో కీలకంగా మారింది.అన్ని రంగాలలో భారతీయులే టాప్ లిస్టు లో ఉన్నారు.
అయితే తాజాగా వెలువడిన ఒక నివేదికలో సైతం భారత ఎన్నారైలె ముందు నిలిచారట.మరి ఆనివేదిక ఏమిటంటే.విదేశాల్లో ఎంతో కష్టపడి పని చేసుకుని సంపాదిస్తున్న సొమ్ముని భారత ఎన్నారైలు స్వదేశానికి పంపుతున్నారు ఇలా గత ఏడాది అంటే 2017 వీరు పంపించిన మొత్తం 6,900 కోట్ల డాలర్లు.ప్రస్తుత డాలర్ మారకం రేటు ప్రకారం చూస్తే ఇది దాదాపు రూ.4.62 లక్షల కోట్లకు సమానమని అన్నారు ఈ లెక్కలు చూసి విదేశీయులకి చుక్కలు కనిపించాయట.
ఇంకొక విషయం ఏమిటంటే ప్రపంచంలో మరే దేశ ప్రవాసులు స్వదేశానికి ఇంత భారీ స్థాయిలో నిధులు పంపించడం ఇప్పటి వరకూ లేదంట ఈ విషయాన్ని అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఎఫ్ఎడి) తన తాజా నివేదికలో ఈ విషయం తెలిపింది ప్రవాసుల నుంచి ఏటా ఇలా అత్యధిక నిధులు అందుకుంటున్న దేశాల్లో భారత్ తర్వాత చైనా 6,400 కోట్ల డాలర్లు, ఫిలిప్పీన్స్.3,300 కోట్ల డాలర్లు.పాకిస్థాన్ 2,000 కోట్ల డాలర్లు.వియత్నాం 1,400 కోట్ల డాలర్లు దేశాలు ఉన్నాయి.
అయితే ఎక్కువగా ఈ సొమ్ము గ్రామీణ ప్రాంతాల ప్రజలకి వెళ్తోందట.అక్కడి నుంచీ దుబాయి కంట్రీస్ కి ఎక్కువగా ఉపాదికోసం వెళ్తూ ఉంటారు అయితే గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళే నిదులల్లో ఎక్కువగా నేపాల్‌లో 81 శాతం.
భారత్‌లో 67 శాతం.వియత్నాంలో 66 శాతం, బంగ్లాదేశ్‌లో 65 శాతం.
పాకిస్థాన్‌లో 61 శాతం.ఫిలిప్పీన్స్‌లో 56 శాతం గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నట్టు ఐఎఫ్‌ఎడి పేర్కొంది.