మానవత్వం చాటిన భారత ఎన్నారైలు

కన్న తల్లిని సొంత ఊరిని మర్చిపోకూడదు అంటారు.కన్న తల్లికి మనం ఎంతటి గొప్ప స్థానాన్ని ఇస్తామో పెరిగిన ఊరికి కూడా అంతే స్థాయిలో గౌరవం ,ప్రేమ ,ఆదరణ ఇవ్వాలి ఆ ఊరి అభివృద్దిలో పాలు పంచుకోవాలి.

 Nri Mekala Prabodh Reddy Helps Blind School Nalgonda-TeluguStop.com

ఇదే తరహా పని పెరిగిన ప్రాంతానికి ఎంతో దూరంగా ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు.అయితే ఈ క్రమంలోనే తమ సొంత ఊరికి కొంతమది ప్రజలు చేసిన సాయం మాత్రం మరువలేనిదని చెప్పాలి.

వివరాలలోకి వెళ్తే.

భారత ఎన్నారైలు ఎప్పటికప్పుడు వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి గానీ.ఫాటశాలల మరమ్మత్తులు లేదా నిర్మాణాల కోసం.పేద విద్యార్ధుల చదువులకోసం విరాళాలు ఇస్తూనే ఉంటారు.

అయితే ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాకి చెందిన కొంతమంది ఎన్నారైలు అదే జిల్లాలో డ్వాబ్ అనే సంస్థ నిర్వహిస్తున్న అంధుల పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని ఇచ్చారు.

ఈ మేరకు ఆ సంస్థ వారికి ప్రత్యెక ధన్యవాదాలు తెలిపింది.

అడిగిన వెంటనే కాదని అనకుండా ఈ పాఠశాల కి సాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రవాసాంధ్రులు మేకల ప్రబోధ్‌ రెడ్డి, యల్క ప్రదీప్‌ రెడ్డి, కందకూరి శ్రీనివాసులకి ఈ సందర్భంగా డ్వాబ్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు ముగ్గురు ప్రవాసీయులకి అభినందనలు తెలిపారు…అయితే తాము ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నామని అదే క్రమంలో ఈ పాఠశాల గురించి తెలుసుకుని సాయం చేయడానికి ముందుకు వచ్చామని తెలిపారు ఎన్నారైలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube