టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు కాదన్న ఆయన చంద్రబాబా అని ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలో చంద్రబాబా పేదలను ధనికులను చేస్తారా అని ప్రశ్నించారు.చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్క పైసా అయినా సబ్సిడీ ఇచ్చారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందన్నారు.పేదలకు మంచి జరిగితే చంద్రబాబు తట్టుకోలేరని విమర్శించారు.
లోకేశ్ లా అడ్డదారిలో మంత్రులం కాలేదని స్పష్టం చేశారు.