Savitri Mayabazar Movie: సావిత్రి అక్కడ నటించలేదు , జీవించారు.. అందుకే ఈ రోజు ఇన్ని సినిమాలు

కొన్ని విషయాల గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.అలాంటి అద్భుతమైన విషయాల్లో రెండు ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకోబోతున్నాం.

 No Once Can Replace Savitri In Ghatothkachudu Details, Savitri, Mahanati Savitri-TeluguStop.com

మొదటిది మహానటి సావిత్రి మాత్రమే చేయదగిన ఒక పాత్ర గురించి.మరొకటి మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ప్రధాన ఇతివృత్తంగా నిర్మించిన మొదటి సినిమా గురించి.

ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయ్యి ఉన్నాయ్.ఇప్పుడు అంటే ఇలాంటి ఒక కథాంశం బేస్ చేసుకొని మనం చాలానే సినిమాలను చూస్తున్నాం.

అందులో చెప్పుకోదగ్గ సినిమాల విషయానికి వస్తే అవి అపరిచితుడు, చంద్రముఖి వైగైరా కొన్ని ఉన్నాయ్.ఇక ఇలాంటి సినిమాలను హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం కాదు.

మొట్టమొదటగా ఇలాంటి సినిమాలను తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం మాయాబజార్. ఈ సినిమాలో ఘటోత్కచుడి గా శశి రేఖ మారుతుంది.తెలుగు సినిమాల్లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నప్పటికి మాయాబజార్ లాంటి సినిమా మాత్రం సినిమాలకే పెద్దన్న లాంటింది.ఇలా ఈ సినిమాలో శశిరేఖ ఘటోత్కచుడిగా మారడం అనే ఒక అంశాన్ని పట్టుకొని పది రకాల కథలను అల్లవచ్చు.

ఈ సినిమా ఇంత విజయవంతం అవ్వడానికి ఇలాంటి ఒక కథాంశం సెలెక్ట్ చేసుకొని దాని కోసం ఎంతో పెద్ద నటులను కూడా ఎంచుకోవడం కూడా ముఖ్య కారణం.ఇక ముఖ్యం గా మహా నటి సావిత్రి గురించి ఎంత చెప్పిన తక్కువే.

Telugu Mayabazar, Nandamuritaraka, Savitri, Tollywood-Movie

శశిరేఖ పాత్రలో సావిత్రిని కాదని మరొక నటిని పెడితే ఈ సినిమా ఇంత విజయవంతం అయ్యేదా అనే అది చాల పెద్ద అనుమానమే.సినిమా కృత్రిమం గా మారే అవకాశం ఉండేది.ఎందుకంటే అక్కడ సావిత్రి ఉంది ఆమె ఏమి సాదా సీదా నటి కాదు.అందుకే ఆ సన్నివేశాలు అంత చక్కగా పండాయి.ఇక మాయాబజార్ సినిమాలో మిగతా పాత్రల్లో నటించిన వారి గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది.అందుకే మాయాబజార్ ఒక ఒక లైబ్రరీ, ఒక పాఠ్యగ్రంథం, ఒక ప్రబంధం, ఒక డిక్షనరీ వంటి సినిమా.

అది ఎప్పటికి వెన్నె పోగొట్టుకొని కళాఖండం.ఎన్ని మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ సినిమాలు వచ్చిన దానికి మూలం మాత్రం మాయాబజార్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube